బుల్లితెర కామెడీ షోలలో మెగా బ్రదర్ నాగబాబు, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ‘కామెడీ స్టార్స్ ధమాకా’ ఒకటి. ఈ మధ్యకాలంలోనే ప్రారంభమైన ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులతో పాటు నాగబాబు ఫ్యాన్స్, శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ ఈ షోను బాగా ఆదరిస్తున్నారు. అయితే.. జబర్దస్త్ లాగే ఈ కామెడీ షో కూడా ఇప్పుడిప్పుడే ఫేమ్ సంపాదించుకుంటోంది.
ఈ క్రమంలో కామెడీ స్టార్స్ ధమాకా లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి కొత్త రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో అంతా చాలా కామెడీ పంచులతో ఉల్లాసంగా సాగింది. ముఖ్యంగా ముక్కు అవినాష్ చేసిన స్కిట్ ప్రోమో మొత్తంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో అవినాష్ స్కిట్ లో అమ్మ రాజశేఖర్ కూడా సందడి చేశారు. అయితే.. స్కిట్ లో భాగంగా అవినాష్ శేఖర్ మాస్టర్ పై పంచులు వేశాడు. వెంటనే అందుకున్న నాగబాబు.. “శేఖర్ మాస్టర్ చాలా ప్రమాదకరం.. అనుకునేంత అమాయకుడేం కాదు” అంటూ శేఖర్ మాస్టర్ పై పంచులు వేస్తూ నవ్వేశాడు. ఓవైపు అవినాష్, మరోవైపు నాగబాబు పంచులకు శేఖర్ మాస్టర్ షాకయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.