హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్‌లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిహారికకు నోటీసులు కూడా జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ సంఘటనపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. డ్రగ్స్ కేసులో నిహారికకు నోటీసులు వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన వీడియో కూడా విడుదల చేశారు. ఆ వివరాలు.
ఇది కూడా చదవండి: బన్నీపై నిహారిక కామెంట్స్ వైరల్
ఈ వీడియోల నాగబాబు మాట్లాడుతూ..‘‘గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్‌లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కుమార్తె అక్కడ ఉండటం. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పోలీసులు పబ్‌పై యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు నిహారిక విషయంలో ఎలాంటి తప్పులేదని తెలిపారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అవాస్తవా ప్రచారాలకు తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియోని రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అనవసర వార్తలను ప్రచారం చేయోద్దని కోరుతున్నాను’’ అని తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నిహారిక విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.