ప్రతీ ఏటా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో జరుపుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, నైజాం, ఆంధ్ర ప్రాంతాల నుండి వచ్చే అభిమానుల కోసం ఇప్పటివరకూ శిల్ప కళా వేదికలో మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. అయితే ఈసారి ఇంకా భారీగా, సరికొత్తగా చిరు బర్త్‌డేని సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అభిమానుల కోసం మెగా కార్నివాల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ‘మెగా కార్నివాల్: నెవర్ బిఫోర్ ట్రిబ్యూట్’ పేరిట ఈవెంట్ లోగోను కూడా మెగా బ్రదర్ నాగబాబు లాంచ్ చేశారు. కొన్ని దశాబ్ధాలుగా, ఇంచుమించు 20, 30 ఏళ్ల నుంచి చిరుని అభిమానించే ఎంతోమంది అభిమానులలో జీవితాల్లో సెటిలయిన వాళ్ళు, రిటైర్ అయినవాళ్ళు ఉన్నారు. అలానే మెగాస్టార్‌తో పాటు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా హీరోలని అభిమానించే అభిమానులు ఉన్నారు. వీరందరికీ ఆటవిడుపుగా, అన్నయ్య బర్త్‌డే అంటే ఒక పండగలా ఉండాలని భావించి ప్రతీ ఏటా ఈ బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్నామని నాగబాబు అన్నారు.
అయితే ఈసారి ఈ ఫెస్టివల్‌లో అభిమానులను ఇన్వాల్వ్ చేస్తూ కొత్తగా ఒక కార్నివాల్‌ను ప్లాన్ చేస్తున్నామని అన్నారు. నాటుగా చెప్పాలంటే జాతర అని అనవచ్చని, జాతరలో రకరకాల ఈవెంట్‌లు ఉంటాయని అన్నారు. జాతరని తలపించే విధంగా అన్నయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశామని అన్నారు. దేశంలో ఏ హీరోకి ఇంత గ్రాండ్‌గా ఈవెంట్ జరగలేదని, ఒక హీరోకి ఇలాంటి కార్నివాల్ ఈవెంట్‌ను నిర్వహించడం దేశంలోనే ఇదే తొలిసారి అని అన్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు చేయడం గర్వకారణమని అన్నారు. కార్నివాల్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఈ నెల 22న హైటెక్స్‌లో ఘనంగా నిర్వహిస్తున్నామని, అభిమానుల కోసం ఇంత భారీగా కార్నివాల్ డిజైన్ చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. ఈ కార్నివాల్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ మినహా మెగా ఫ్యామిలీ హీరోలు, సినిమా సెలబ్రిటీలు హాజరవుతారని నాగబాబు అన్నారు. లెజెండ్ అన్న పదం కూడా చిరంజీవికి చిన్నదే అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. లైవ్ డీజే, లైవ్ డ్రమ్స్, లైవ్ సింగింగ్ బ్యాండ్, లైవ్ డ్యాన్స్ ఫ్లోర్ వంటి అనేక ప్రోగ్రామ్స్‌ని సింగిల్ ఈవెంట్‌లో డిజైన్ చేశారు. మరి ఈ మెగా మాస్ జాతరపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.