రోడ్డుపై ఒక యువకుడు ఒక అమ్మాయిని కొట్టాడు. ఆ దృశ్యాన్ని కారులో వెళ్తున్న నాగశౌర్య చూశారు. వెంటనే కారు దిగి యువకుడి దగ్గరకు వెళ్లి ఎందుకు కొట్టావ్ అని ప్రశ్నించారు. ఆ యువకుడు ఎందుకు కొట్టాడు. ఆ అమ్మాయికి, యువకుడికి ఏంటి సంబంధం? ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గంగతో రాంబాబు సినిమాలో కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే లాగి కొడుతుంటాడు హీరో. తప్పు చేస్తే కొడతా, సీఎం అయినా, చీమయినా ఒకటే అని అంటాడు రాంబాబు. సినిమాలో ఉన్నట్టే బయట కూడా రాంబాబులు ఉంటారు. కొంతమంది ఉంటారు. సమాజంలో ఏదైనా చెడు జరుగుతుంటే సహించలేరు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తించినా, అమ్మాయిల పట్ల మిస్ బిహేవ్ చేసినా వెంటనే రియాక్ట్ అవుతారు. సినిమాల్లో అమ్మాయిల గురించి బ్యాడ్ కామెంట్స్ చేసినా, అమ్మాయిలను కొట్టినా రౌడీలను హీరోలు రఫ్ఫాడిస్తారు. తాజాగా హీరో నాగశౌర్య కూడా ఒక యువకుడ్ని అమ్మాయి మీద చేయి చేసుకున్నందుకు ఆల్మోస్ట్ రఫ్ఫాడించే స్థాయికి వెళ్లారు.
నాగశౌర్య తన కారులో వెళ్తుండగా ఒక యువకుడు తన ప్రేమికురాలిపై చేయి చేసుకున్నాడు. అది చూసిన నాగశౌర్య వెంటనే కారు దిగి ఆ వ్యక్తి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. రోడ్డు మీద అమ్మాయిని ఎందుకు కొట్టావ్ అని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పు అంటూ నిలదీశారు. ఆ యువకుడు ఆ అమ్మాయి తన ప్రేమికురాలు అని, క్షమాపణ చెప్పను అంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే నాగశౌర్య యువకుడి చేయి పట్టుకుని ఆపి.. ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్తావా లేదా అంటూ అడిగారు. పక్కనే ఉన్న స్థానికులు కూడా క్షమాపణే కదా చెప్పు అంటూ అన్నారు. కానీ ఆ యువకుడు మాత్రం తన లవర్ కి క్షమాపణ చెప్పడం ఏమిటన్నట్టు వ్యవహరించాడు.
లవర్ ఐతే రోడ్డు మీద కొట్టేస్తావా అంటూ యువకుడ్ని నాగశౌర్య గట్టిగానే తగులుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లోనే కాదు బయట కూడా అన్యాయం జరిగితే స్పందించే రియల్ హీరోలు ఉంటారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం తన లవర్ నే కదా కొట్టింది, ఆ అమ్మాయికి లేని సమస్య నీకెందుకు అంటూ నాగశౌర్యపై కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై తప్పు ఎవరిదో కామెంట్ చేయండి.