తెలుగు ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారిలో లవబుల్ కపుల్ గా సమంత-చైతూ అనేవారు. కానీ వీరి మద్య సంబంధం తెగిపోయింది.. విడాకులు తీసుకొని రెండేళ్లయ్యింది. ప్రస్తుతం ఇద్దరు తమ కెరీర్ పై ఫోకస్ పెట్టారు.
సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే కలిసిమెలిసి జీవిస్తున్నారు.. చాలా మంది వివాహం జరిగిన కొద్ది సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. అలాంటి జంటల్లో ఒకరు అక్కినేని నాగ చైతన్య, సమంత. ఏం మాయచేసావే మూవీలో నటించిన ఈ జంట రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకొని ప్రస్తుతం సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత మొదటిసారిగా సమంత గురించి నోరు విప్పాడు నాగచైతన్య. వివరాల్లోకి వెళితే…
తెలుగు ఇండస్ట్రీలో లవబుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు అయ్యింది. అఫిషియల్ గా విడాకులు తీసుకొని ఏడాది పూర్తయ్యింది. వీరిద్దరూ విడిపోయిన తర్వాత కెరీర్ పై పూర్తిగా ఫోకస్ పెట్టారు. చైతూ-సమంత విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. వాటన్నింటిని పట్టించుకోకుండా తమ పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది సమంత నటించిన యశోద మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇదిలా ఉంటే నాగ చైతన్య మొదటిసారిగా రెండు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘కస్టడి’. వెంటక్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీ ఈ నెల 12న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చైతూ ప్రమోషన్ బిజీలో నిమగ్నమయ్యాడు. తాజాగా చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ముచ్చటించాడు.
కస్టడీ మూవీ ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘మేం విడాకులు తీసుకొని రెండేళ్లయ్యింది.. చట్టప్రకారం ఏడాది గడిచింది. న్యాయస్థానం మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేం ఇద్దరం మా కెరీర్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. జీవితంలో ఎదురయ్యే ప్రతి దశ, సంఘటనను నేను గౌరవిస్తాను. ఇక సమంత విషయానికి వస్తే.. తను చాలా మంచిది. ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది.. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారాయి.. మేం ఇద్దరం ఒకరికి ఒకరు గౌరవించుకోవడం లేదని.. ఇద్దరి మద్య డామినేషన్ కొనసాగుతుందని.. మరీ దారుణమైప విషయం ఏంటంటే.. మా మద్య మూడో వ్యక్తి ఉన్నారని వార్తలు రావడం చాలా బాధ అనిపించింది. వ్యక్తగత విషయాల గురించి ప్రస్తావిస్తే.. మొదట్లో పట్టించుకోలేదు.. కానీ ఇప్పటికీ నా పెళ్లి గురించిన టాపిక్ తీసుకువస్తూనే ఉన్నారు.. ఇలాంటి రూమర్లు ఎందుకు సృష్టిస్తారో నాకస్సలు అర్థం కాదు’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు నాగ చైతన్య.