Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కొంతకాలానికే మనస్పర్థలు వచ్చాయంటూ విడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా పెళ్ళైన నాలుగేళ్లకే విడిపోయిన స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమలో వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021 కరోనా లాక్ డౌన్ లో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించేసరికి ఫ్యాన్స్ అంతా షాకయ్యారు.
ఆ తర్వాత ఎవరిదారిలో వారు బిజీ అయిపోయారు చైతూ, సామ్. అయితే.. వీరిద్దరూ విడిపోయినప్పటి నుండి ఎలాంటి పోస్టులు పెట్టినా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పోస్టులో తన తల్లి, తండ్రితో పాటు సమంతతో కలిసి ఉన్నప్పుడు పెంచుకున్న కుక్కపిల్ల ‘హ్యాష్’ ని కూడా మెన్షన్ చేస్తూ థ్యాంక్స్ చెప్పడం గమనార్హం.
చిన్నప్పుడు తల్లితో దిగిన ఒక ఫోటో, తండ్రి నాగార్జునతో ఒక ఫోటో.. అలాగే సమంత పెట్ ‘పిట్ బుల్ డాగ్’ హ్యాష్ తో ఒక ఫోటో షేర్ చేశాడు. పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పడం వరకూ ఓకే.. కానీ సమంత పెట్ కి ఎందుకు అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య హీరోగా రాశిఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించిన ‘థాంక్యూ’ సినిమా జూలై 22న రిలీజ్ అవుతున్న విషయం విదితమే.
ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతూ ఆ పోస్ట్ పెట్టాడని తెలుస్తుంది. ఆ పోస్టులో తాను జీవితంలో ముగ్గురికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నానని కన్నతల్లి, తండ్రి నాగార్జునతో పాటుగా సమంత పెట్ హ్యాష్ ఫోటోలు షేర్ చేశాడు. తల్లి, తండ్రికి థ్యాంక్స్ చెప్పాక.. “ఎలా ప్రేమించాలి? మనిషిలా ఎలా ఉండాలి అని తనకు హ్యాష్ నేర్పించింది” చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురు తన జీవితంలో ముఖ్యమైన వారు అంటూ నాగచైతన్య పోస్ట్ చేశాడు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న నాగచైతన్య పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.