సాధారణంగా ఓ భాషలో స్టార్డమ్ సంపాదించుకున్న నటులు మరో భాషకు చెందిన సినిమాలలో నటించడం అనేది మామూలే. ఇదివరకు పరభాషా నటులు ఎక్కువగా తెలుగు సినిమాలు చేసేవారు. అయితే.. కొన్నేళ్లుగా తెలుగు నటులు కూడా పరభాషా సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి అక్కినేని నాగచైతన్య చేరాడు. టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు చైతూ. సినిమా సినిమాకి నటుడిగా తనను తాను మెరుగు పర్చుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. 1994లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు అనే కీలకపాత్రలో నటించాడు. ఆమిర్ ఖాన్ సినిమా అంటే అందరికీ తెలిసిందే. కంటెంట్ ప్రధానంగా సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ సినిమాలో చైతూ కీలక ఆర్మీ ఫ్రెండ్ రోల్ చేసేసరికి.. అందరి దృష్టి చైతూ పై పడింది. ఎందుకంటే.. బాలరాజు గెటప్ లో చైతూ ఇన్నోసెంట్ లుక్ ఆ విధంగా ఆకట్టుకుంటోంది.
ఇక లాల్ సింగ్ చడ్డాలో చైతూ బాలరాజు పాత్రకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ అయ్యింది. ఆ మేకింగ్ వీడియోలో నాగ చైతన్య పెళ్లి బట్టలలో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఒరిజినల్ సినిమాలో చైతూ రోల్ హీరోకి ఆర్మీలో పరిచయమై అక్కడే వీరి మధ్య స్నేహం మొదలవుతుంది. అయితే.. ఒరిజినల్ సినిమాలో ఆర్మీ ఫ్రెండ్ అయిన బాలరాజు క్యారెక్టర్ కి యుద్ధంలో ఫిజికల్ డామేజ్ అవ్వడమే కాకుండా అతనికి పెళ్లి జరిగే విషయాన్ని అంత ప్రత్యేకంగా చూపించరు.
ఇప్పుడు లాల్ సింగ్ లో వచ్చేసరికి నాగచైతన్య క్యారెక్టర్ కి పెళ్లి ఎపిసోడ్ ని యాడ్ చేసారని తెలుస్తుంది. మరి సినిమాలో చైతూ క్యారెక్టర్ కి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారా? లేదా చైతూ కోసం ప్రత్యేకంగా సపరేట్ ట్రాక్ రాసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. మేకింగ్ వీడియో చూస్తుంటే చైతూ పెళ్లి ఎపిసోడ్ కూడా ఉందని అర్థమవుతుంది. అంటే.. ఆమిర్ ఖాన్ చైతూ పాత్రకు పెళ్లిని జోడించి మ్యాజిక్ ఏమైనా చేస్తాడా అనేది తెరపై చూడాలి. ప్రస్తుతం చైతూ పెళ్లి బట్టలలో కనిపిస్తున్న మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.