మెగా బ్రదర్ నాగబాబు తన ఫాలోవర్లతో పెట్టిన ముచ్చట్లలో మంచు ఫ్యామిలీ మీద సెటైర్లతో ఆడుకున్నాడు. తన స్టైల్లో మీమ్స్ వేస్తూ ప్రశ్నలు అడిగే నెటిజన్లకు కౌంటర్లు ఇచ్చే వాడు నాగబాబు. కొంత మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు లైన్‌ను వాడేశాడు నాగబాబు. అయితే ఓ ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద గందరగోళానికి దారి తీస్తోంది.
తెలుగులో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్న సినిమా ఏంటి బ్రో అని నాగబాబుని అడిగేశాడు ఓ నెటిజన్. దానికి నాగబాబు ఇలా సమాధానం ఇచ్చాడు. రెండు సినిమాలున్నాయి. ఒకటి బాహుబలి. ఇంకోటి మొన్ననే థియేటర్లో ఇద్దరితో కలిసి చూశా.. పేరు గుర్తు లేదు అని చెప్పేశాడు. థియేటర్లో ఇద్దరితో చూశాను అని చెప్పడం, సినిమా పేరు గుర్తు లేదని అనడంతో అది కచ్చితంగా సన్ ఆఫ్ ఇండియా సినిమా అని అందరూ అనుకుంటున్నారు.
ఈ మద్య థియేటర్లో ఒక్కరే ఉన్నారు.. థియేటర్లు ఖాళీగా ఉన్నాయి.. ఒక్క టికెట్ కూడా తెగడం లేదంటూ ఆ మూవీపై జరిగిన ట్రోల్ అందరికీ తెలిసిందే. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని నాగబాబు కూడా పరోక్షంగా కౌంటర్ వేసినట్టు అర్థమవుతోంది. మొత్తానికి నాగబాబు కాస్త రిలాక్స్ ఉన్నాడేమో ఏమో గానీ అభిమానుల ప్రశ్నలకు అదిరిపోయే కౌంటర్లు వేశాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.