పూనకాలు తెప్పించే ఒక పాట వస్తుంటే మనుషులు డ్యాన్స్ వేయకుండా ఉండలేరు. అయితే వస్తువులతో కూడా డ్యాన్స్ చేయించే వారు ఉంటారు. అంటే బీట్ కి తగ్గట్టు వస్తువుల మూమెంట్స్ ని సింక్ చేస్తారు. తాజాగా వందకు పైగా కార్లు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాకి అంతర్జాతీయ గౌరవం, గుర్తింపు లభించాయి. అన్నిటికంటే ఎక్కువ గౌరవం ఆస్కార్ తో లభించింది. ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం పట్టువదలని విక్రమార్కుల్లా పని చేశారు. ముఖ్యంగా రాజమౌళి ఖచ్చితంగా ఆస్కార్ కొట్టాల్సిందే అని భీష్మించుకు కూర్చున్నారు. మరి రాజమౌళి అంత పట్టుదలతో ఉంటే ఆస్కార్ రాకుండా ఉంటుందా? 95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
మన ఇండియన్ సినిమాకి ఆస్కార్ వచ్చినందుకు ఇప్పటికే అనేకమంది నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి తమ సంతోషాన్ని నెటిజన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తమ ఎలక్ట్రిక్ కార్లతో నాటు నాటు పాటకు తగ్గట్టు లైట్ షో నిర్వహించారు. అంటే నాటు నాటు పాట వస్తుంటే ఆ పాటకు సింక్ అయ్యేలా తమ కార్ల లైట్లతో స్టెప్పులు వేయించారు. పార్కింగ్ ప్రదేశంలో వందకు పైగా టెస్లా కార్లు ఉన్నాయి. నాటు నాటు పాట వస్తుంటే.. దానికి తగ్గట్టు కార్ లైట్లను వెలిగిస్తూ, ఆపుతూ పర్ఫెక్ట్ గా సింక్ చేశారు. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. దాన్ని టెస్లా లైట్ షోస్ రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.@Teslalightshows light sync with the beats of #Oscar Winning Song #NaatuNaatu in New Jersey 🤩😍
Thanks for all the love. #RRRMovie @Tesla @elonmusk pic.twitter.com/wCJIY4sTyr
— RRR Movie (@RRRMovie) March 20, 2023
ఇటీవలే అమెరికా పోలీసులు నాటు నాటు పాటకు స్టెప్పులు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు హొలీ ఆడుతుండగా.. ఇద్దరు పోలీసులు వారితో కలిసి నాటు నాటు హుక్ స్టెప్స్ వేసి అలరించారు. ఆ పోలీసుల మధ్య నిలబడిన భారతీయ వ్యక్తి వారితో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు. ఇలా ఎక్కడ చూసినా నాటు నాటు పాటే. ఎవరిని కదిపినా నాటు నాటు స్టెప్పులే. ఒక తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అంటే మామూలు విషయం కాదు. అది రాజమౌళి, కీరవాణి వల్లే సాధ్యం. మరి నాటు నాటు పాటకు సింక్ అయ్యేలా టెస్లా వందల కార్లతో ప్రదర్శన చేసిన తీరుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#California cops are enjoying the the #NaatuNaatu song.🙌🙌🤙🤙 Naatu naatu is everywhere #RamCharan #NTR #RRRMovie #SSRajamouli #RRRForOscars #RRR #GlobalStarRamCharan #NTRGoesGlobal #Oscars #Oscars2023 #letsdance pic.twitter.com/rjRQMrjoTs
— being jagan (@nenavat_jagan) March 11, 2023