ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ సాధించి ఇండియా మొత్తం గర్వపడేలా చేసింది. 'నాటు నాటు' పాటకు దేశంతో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆడిపాడారు. ముఖ్యంగా నాటు నాటు హుక్ స్టెప్ కి బీభత్సమైన క్రేజ్ పెరిగింది. ఆస్కార్ సాధించిన మొదటి తెలుగు పాటగా నాటు నాటు హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే.. అందరూ నాటు నాటు సాంగ్ చూసి ఎంజాయ్ చేసి.. విజిల్స్ వేశారు. కానీ.. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ సాధించి ఇండియా మొత్తం గర్వపడేలా చేసింది. ‘నాటు నాటు’ పాటకు దేశంతో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆడిపాడారు. ముఖ్యంగా నాటు నాటు హుక్ స్టెప్ కి బీభత్సమైన క్రేజ్ పెరిగింది. ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడాది పూర్తయినా నాటు నాటు హుక్ స్టెప్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. కట్ చేస్తే.. నాటు నాటు ఏకంగా ఆస్కార్ గెలిచింది. ఇంకేముంది.. ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ. ఆస్కార్ సాధించిన మొదటి తెలుగు పాటగా నాటు నాటు హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే.. అందరూ నాటు నాటు సాంగ్ చూసి ఎంజాయ్ చేసి.. విజిల్స్ వేశారు. కానీ.. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.
అవును.. వరల్డ్ ని షేక్ చేసిన నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఇప్పటిదాకా తెలుగులో ఎన్నో సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈయన.. రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ మూవీ నుండి కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. అయితే.. కొరియోగ్రాఫర్ కాకుముందు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఏం చేసేవాడో తెలుసా? పైగా సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండడు. ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు ప్రేమ్ రక్షిత్. నాటు నాటుకి ఆస్కార్ వరించాక.. అందరూ ఈయన గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆస్కార్ వేడుకలలో పాల్గొన్న ఆర్ఆర్ఆర్ టీమ్ లో ప్రేమ్ రక్షిత్ కూడా పాల్గొన్నాడు. అతన్ని వీడియోస్ లో చూసే ఉంటారు.
ఇకపోతే.. ఆస్కార్ వచ్చాక మొదటిసారి తన కెరీర్ స్ట్రగుల్స్, అవార్డులు.. పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఎప్పుడూ కెమెరా ముందు తక్కువగా కనిపించే ప్రేమ్ రక్షిత్.. రాజమౌళితో తన బాండింగ్ ఎలా మొదలైందో చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. “నేను కొరియోగ్రాఫర్ కాకముందు నుండి కృష్ణానగర్ లో ఉంటున్నాను. అప్పట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ.. కెరీర్ లో స్ట్రగుల్ అవుతున్న టైంలో రాజమౌళి గారి ఇంట్లో పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తూ ఉండేవాడిని. నా జీతం ఐదు వేలు. నాకు అమ్మానాన్న(ఏజ్‌డ్), తమ్ముడు(మూగ, చెవిటి) ఉన్నారు. ఆ ఐదు వేలలో వాళ్లకు మూడు వేలు పంపి.. మిగతా రెండు వేలతో రెంట్, బైక్ పెట్రోల్ కొట్టిస్తూ వెళ్ళేవాడిని.
చాలాకాలం రాజమౌళి ఇంట్లో పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నా కానీ.. ఎప్పుడు ఆయనకు నేను సినిమా సాంగ్స్ కంపోజ్ చేస్తానని చెప్పలేదు. ఎందుకంటే.. ఇంటి డ్యాన్సర్ కి, సినిమా కొరియోగ్రాఫర్ కి తేడా ఉంటుంది. తెలిస్తే ఎక్కడ వర్క్ నుండి తీసేస్తారేమోనని చెప్పలేదు. అయితే.. అదే టైంలో నేను ప్రొడ్యూసర్ ఆర్. బి. చౌదరి గారి మూడో కొడుకు రమేష్ హీరోగా ‘విద్యార్ధి’ సినిమాకి ఓ సాంగ్ కంపోజ్ చేశాను. ఓ రోజు రాజమౌళి ‘విద్యార్ధి’ సినిమాలో నేను కంపోజ్ చేసిన సాంగ్ చూశారు. అప్పుడే వెళ్లి.. ఆ సాంగ్ నేనే కొరియోగ్రాఫ్ చేశానని చెప్పేశాను. అప్పటికీ ఆయన నన్ను నమ్మలేదు. ఆఖరికి ఆర్.బి. చౌదరికి కాల్ చేసి కనుక్కున్నారు. అప్పుడు నాకు ఛత్రపతిలో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. అప్పటినుండి మా జర్నీ ప్రతి సినిమాలో కంటిన్యూ అవుతోంది.” అని చెప్పుకొచ్చాడు ప్రేమ్ రక్షిత్. ప్రస్తుతం రాజమౌళితో తన జర్నీ గురించి ప్రేమ్ రక్షిత్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈయన కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.