చిత్రసీమను విషాదాలు వీడటం లేదు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ప్రొడ్యూసర్ తల్లి కన్నుమూశారు.
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం ఉదయం బాలీవుడ్ స్టార్ సింగర్, ప్రొడ్యూసర్ పమేలా చోప్రా కన్నుమూశారు. దీంతో హిందీ సినీసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ సెలబ్రిటీలు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్‌లోనూ ఇవాళ విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ (చిరంజీవి)కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. చెర్రీ తల్లి మరణించిన విషయాన్ని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఇకపోతే, 1994లో చెర్రీ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘మనీ’, ‘రంగీలా’ సినిమాలకు చెర్రీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీ తీసిన ‘గులాబి’ చిత్రానికి చెర్రీ కో-ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశారు. అనంతరం కొన్నాళ్లకు చంద్రశేఖర్ ఏలేటి సినిమాలకు మార్కెటింగ్ విభాగంలో, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ చేసిన ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’ మూవీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ‘యమదొంగ’కు నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. గోపీచంద్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాను ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న చెర్రీ.. టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌లో సీఈవోగా చేరారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై ‘మత్తు వదలరా’ లాంటి లో బడ్జెట్ మూవీస్ నిర్మించారు. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘మీటర్’ చిత్రాన్ని చెర్రీ నిర్మించారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది.