Pisachi 2: విలక్షణ సినిమాలు తెరకెక్కించే వారిలో తమిళ దర్శకుడు మిస్కిన్ ఒకరు. ఆయన తీసిన ‘పిశాచి’ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘పిశాచి’ సినిమాకు వచ్చిన ఆదరణతో మిస్కిన్ ‘పిశాచి 2’ను తెరకెక్కించారు. పిశాచి 2 తమిళం, తెలుగు, కన్నడ, మలయళ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. ఇక, ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ ఆండ్రియా జర్మయ్య లీడ్ రోల్‌లో నటించారు. తాజాగా, ఈ చిత్రం సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇందుకు కారణం కాలేకపోలేదు.
సినిమాలోని ఓ సీన్‌లో ‘ఆండ్రియా’ నగ్నంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక, తన సినిమాకు ఏ సర్టిఫికేట్ రావటంతో మిస్కిన్ ఆలోచనల్లో పడ్డారు. పిశాచి 2 సినిమాను చిన్నపిల్లలు కూడా చూసే విధంగా చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఆండ్రియా నగ్న దృశ్యాలు ఉన్న సీన్‌ను తొలగించి, మరోసారి సెన్సార్ బోర్టుకు పంపాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పుకారు షికారు చేస్తోంది. ఆండ్రియా నగ్న దృశ్యాలను దర్శకుడు మిస్కినే స్వయంగా చిత్రీకరించారన్న ప్రచారం నడుస్తోంది.
దీనిపై మిస్కిన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ నాకు, ఆండ్రియాకు స్నేహితుడైన ఓ వ్యక్తి ఆ ఫొటోలు తీశాడు. ఆ సమయంలో నా అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఓ అమ్మాయి మాత్రమే అక్కడ ఉంది. నేను ఆ ఫొటోలను చూడలేదు. నా సినిమాను పిల్లలు కూడా చూడాలని భావిస్తున్నాను. అందుకే ఆ నగ్న చిత్రాలను తీసేయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నా సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమాలో ఆ ఫొటోలు ఉంటే పిల్లలు నా సినిమా చూడకుండా అడ్డుకున్న వాడిని అవుతా’’ అని ఆయన అన్నారు. మరి, ఆండ్రియా నగ్న చిత్రాలపై దర్శకుడు మిస్కిన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Liger 3 Days Collections: కలెక్షన్ల దుమ్మురేపుతున్న లైగర్.. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే!