చరణ్, ఎన్టీఆర్ ల వల్లే స్టార్ హీరోయిన్ కొడుకు అన్నం తింటున్నాడా? ఏ ఆ హీరోయిన్ దగ్గర బియ్యం, పప్పులు, ఉప్పు కొనుక్కోవడానికి డబ్బు లేదా? అని అనకండి. ఆమె అపర కోటీశ్వరురాలు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తరగనంత ఆస్తి ఉంది.. కానీ తన కొడుకు అన్నం తినడానికి చరణ్, ఎన్టీఆర్ లు కావాల్సి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ లు కనబడితేనే అన్నం తింటానని స్టార్ హీరోయిన్ కొడుకు మారాం చేస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?
పిల్లలు అన్నం తినడానికి మారాం చేస్తుంటారు. అయితే పిల్లలకు అన్నం తినిపించడానికి చందమామ రావే, జాబిల్లి రావే అని ఒకప్పుడు పాటలు పాడేవారు. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉంది. చింపుల్ గా స్మార్ట్ ఫోన్ చేతికిచ్చి బొమ్మలు చూసుకోమని చెప్పి అన్నం తినిపిస్తున్నారు. ఈ సమస్య సామాన్యులదే కాదు, సెలబ్రిటీలది కూడా. ఎక్కడో బాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోయిన్ కొడుకు మన తెలుగు హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ల బొమ్మ కనబడకపోతే అన్నం తినమని మొండికేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆ హీరోయినే స్వయంగా వెల్లడించింది. ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ బిడ్డకు చరణ్, ఎన్టీఆర్ లు చందమామలైపోయారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో నాటు నాటు పాట ప్రపంచమంతా ఉన్న సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ వేదిక మీద తెలుగు పాట భారతీయ జెండా ఎగురవేసింది. అంతటి ఘనత సాధించిన పాట కేవలం పెద్దలనే కాదు.. చిన్న పిల్లలను కూడా ఆకట్టుకుంటుంది. ఆ పాట వినబడితే చాలు పూనకాలతో ఊగిపోతున్నారు. నాటు నాటు పాటలో చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి పిల్లలు కూడా స్టెప్పులేస్తున్నారు. ఈ పాటకు ఫ్యాన్ కానివారు లేరు. అన్ని వయసుల వారు అభిమానులైపోయారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రెండేళ్ల చిన్న కొడుకు జహంగీర్ కూడా నాటు నాటు పాటకు ఫ్యాన్ అయిపోయాడు.
ఎంతలా అంటే ఆ పాట పెట్టకపోతే అన్నం మానేసేంతగా ప్రభావితం అయిపోయాడు. తన కొడుకు నాటు నాటు పాటకు డ్యాన్స్ వేయడాన్ని ఇష్టపడతాడని.. ఆ పాట ప్లే చేయకపోతే అన్నం కూడా తినడని కరీనా కపూర్ బాలీవుడ్ మీడియాతో వెల్లడించింది. అయితే నాటు నాటు పాట అంటే హిందీ వెర్షన్ అనుకున్నారేమో.. కాదండి బాబు.. అచ్చ తెలుగు పాటే వింటాడు. తెలుగు పాట అయితేనే వింటాడట. అంతలా బుడ్డోడి మనసు గెలుచుకుంది మన తెలుగు పాట. అయితే ఈ పాట ఇంతలా అందరినీ ఆకట్టుకోవడానికి చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక కారణమని చెప్పాలి. వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్స్ ని ఎంతోమంది వేశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. మరి బాలీవుడ్ హీరోయిన్ కొడుకు అన్నం తినాలంటే.. చరణ్, ఎన్టీఆర్ లు నర్తించిన స్వచ్ఛమైన తెలుగు నాటు నాటు పాట పెట్టాల్సిందే. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.