దేశంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ మొదలైపోయిందన్న కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి. థర్డ్ వేవ్ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సెలబ్రెటీ వేవ్ స్టార్ట్ అయినట్టు ఉంది. ఇప్పటికే నటుడు విశ్వక్ సేన్, మహేశ్ బాబు, నటి మంచు లక్ష్మీ, హీరో నితిన్ భార్య షాలిని వంటి వారు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఇప్పుడు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ కూడా కరోనా బారిన పడటం అందరిని షాకి కి గురి చేస్తోంది.
అఖండ మూవీ సక్సెస్ తో థమన్ మంచి స్వింగ్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు రాధేశ్యామ్ మూవీకి కూడా థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇవే కాక.. థమన్ చేతిలో చాలానే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా ఏ వర్క్స్ కోసం ట్రావెల్ చేసిన సమయంలోనే థమన్ కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. ఏదేమైనా. థమన్ త్వరగా ఈ మహమ్మారి బారి నుండి బయట పడాలని కోరుకుందాం.
Music director @MusicThaman tested positive for #Covid19, wishing him a speedy recovery. pic.twitter.com/Fh4TRYBUxH
— VamsiShekar (@UrsVamsiShekar) January 7, 2022