ఈ మధ్య సినిమాలలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్(నేపథ్య సంగీతం)కి ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికి తెలిసిందే. ఒక్కోసారి సినిమా కథ – కథనాలలో మ్యాటర్ ఉన్నా లేకపోయినా.. బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని హైలైట్ చేస్తుంటుంది. అందుకు ఉదాహరణగా ఎన్నో సినిమాలున్నాయి. కానీ ఇటీవలి కాలంలో సినిమాలకు బాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే గుర్తొచ్చే పేరు ఎస్ఎస్ థమన్.
గత రెండేళ్లుగా థమన్ పట్టిందల్లా బంగారం అన్నట్లుగా.. తాను చేసిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాలకు నేపథ్య సంగీతం విషయంలో తమన్ ని బీట్ చేయలేకపోతున్నారు. సాంగ్స్ నుండి బాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ గా మారాడు తమన్. అందుకు ఉదాహరణే లేటెస్ట్ అఖండ చిత్రం. అఖండ చిత్రాన్ని తమన్ మ్యూజిక్ తోనే మరోస్థాయికి తీసుకెళ్లాడని చెప్పవచ్చు.
అలాంటిది ఇప్పుడు తమన్ చేతికి మరో జాక్ పాట్ దక్కిందనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో జనవరి 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకరన్(సౌత్), మిథున్ – అమల్ మాలిక్ – మనన్ భరద్వాజ్ హిందీ భాషలో సాంగ్స్ అందిస్తున్నారు. తాజాగా వీరి లిస్టులో తమన్ చేరినట్లు సమాచారం.
సాంగ్స్ కోసం కాదు.. బాక్గ్రౌంగ్ మ్యూజిక్ అందించేందుకేనట. ఇటీవలే అఖండ అనంతరం రాధేశ్యామ్ మేకర్స్ తమన్ ని బిజీఎమ్ కోసం సంప్రదించగా.. తమన్ అందుకు ఓకే చెప్పి ఒప్పందం పై సంతకం చేసినట్లు తెలుస్తుంది. తమన్ ఆన్ బోర్డులోకి రావడం పై రాధేశ్యామ్ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు తమన్ ప్రభాస్ నటించిన సాహో సినిమా టీజర్ కి బాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఫుల్ లెన్త్ సినిమా ఛాన్స్ వచ్చేసరికి బిజీఎమ్ వీరకుమ్ముడు కుమ్ముతాడేమో చూడాలి అంటున్నారు డార్లింగ్ ఫాన్స్. మరి అఖండ మాస్ జాతరలాగే రాధేశ్యామ్ ను కూడా తమన్ బిజీఎమ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడా.. లేదా చూడాలి. త్వరలోనే ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. తమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.