తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజే మరణించారు. రాజ్-కోటి కాంబినేషన్ లో కొన్ని వందల చిత్రాలు వచ్చిన సంగతి తెలిసాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజే మరణించారు. రాజ్-కోటి కాంబినేషన్ లో కొన్ని వందల చిత్రాలు వచ్చిన సంగతి తెలిసాయి. అయితే కోటీతో విబేధాల కారణంగా రాజ్ మ్యూజిక్ డైరెక్షన్ కి దూరమయ్యాడు. అలనాటిఫేమస్ సంగత దర్శకుడు టీవీ రాజకుమారుడు రాజ్. ఈయన అసలు పేరు తోటకూర సోమరాజు. లంకేశ్వరుడు, యముడికి మొగుడు, హాలోబ్రదర్, ఘరానా బుల్లోడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. రాజ్ మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
రాజ్ కోటి ఇద్దరు కాదు ఒక్కరే అనేట్లుగా వీరిద్దరి ప్రయాణం సాగింది. 1990ల్లో వీరి మ్యూజిక్ జనాలను ఎంతలా ప్రభావం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు మ్యూజిక్ ఇస్తే ఖచ్చితంగా ఆ సినిమా హిట్టే అనే టాక్ ఇండస్ట్రీలో ఉండేది. ఖచ్చితంగా సంగీత దిగ్గజాల సరసన వీరు పేరు నిలుస్తుంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో వుండగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరి దారులు వేరయ్యారు. దీంతో అప్పటినుంచి విడివిడిగా సినిమాలు చేస్తున్నారు. రాజ్ మరణ వార్తతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అమలుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.