మెలోడి బ్రహ్మ మణిశర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో మణిశర్మ పని చేశారు. మెగాస్టార్ చిరంజీవి ‘చూడాలని వుంది’ సినిమాతో పుర్తిస్థాయి సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాకు సంగీతం అందించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. దీంతో మణిశర్మపై విమర్శలు వచ్చాయి. ఆయన అందించిన సంగీతం బాగాలేదని కొందరు విమర్శించారు. వీటిపై తాజాగా మణిశర్మ స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్ లోని షోలో పాల్గొన్న ఆయన ఆచార్య సినిమాతో పాటు తన సినీకెరీర్ కు సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీతమే ఆయన సామ్రాజ్యంగా, స్వరాలు ఆయన చేతిలో అస్త్రాలుగా ఉండి ఎన్నో సంచలనాలు సృష్టించాయి. ఆయన స్వరాలతో నిండిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించాయి. రికార్డులు తిరగరాసిన హిట్ మూవీలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్న మణిశర్మ సంగీత ప్రియుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అంతేకాక అనేక బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ లు అందించారు. రెండు వందలకుపైగా సినిమాలకు కీ బోర్డు ప్లేయర్ , సంగీత దర్శకుడిగా పనిచేశారు. చూడాలని వుంది సినిమాతో సంగీత దర్శకుడిగా.. తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన మణిశర్మ.. తెలుగులో స్టార్ మ్యూజిక్ కంపోజర్‌గా ఎదిగారు. అయితే, గత కొంతకాలం నుంచి మణిశర్మకు అవకాశాలు తగ్గాయి. యువ సంగీత దర్శకులతో ఆయనకు పోటీ ఎక్కువైపోయింది.
అయితే ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి ఫామ్ అందుకున్నాడు. అలానే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య చిత్రానికి సంగీతం అందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాభవం చవిచూసింది. చిరంజీవి ఎన్నో సినిమాలకు ప్రాణం పోసి మ్యూజిక్ అందించిన మణిశర్మకు ఆచార్య ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగాలేదని విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని మణిశర్మ.. తాజాగా ఓ షోలో సమాధానం ఇచ్చారు. కోటి, కీరవాణి లాంటి సంగీత దర్శకుల దగ్గర చిరు సినిమాలకి పనిచేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చానని, చిరుకి ఎలాంటి మ్యూజిక్ కొట్టాలో తనకు తెలుసని మణిశర్మ తెలిపారు.
అయితే ఆచార్య సినిమా విషయానికి వస్తే.. కొరటాల శివ వచ్చి.. మీరు ఎలా అనుకుంటున్నారో అలా వద్దు, చాలా కొత్తగా కొట్టాలని తెలిపినట్లు మణిశర్మ చెప్పుకొచ్చాడు. సరే ప్రయోగం చేద్దాం అని అలా చేశానని మణిశర్మ అన్నారు. మణిశర్మ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆచార్య సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై పలువురు నెటిజన్లు స్పందించారు. ఏ మూవీ టీమ్ తమ సినిమాను హిట్ కొట్టాలనే తీస్తారు. కొన్నిసార్లు అవి సక్సెస్ అవుతాయి…కొన్నిసార్లు విఫలమవుతుంటాయి..అందుకు ఎవరిని తప్పుబట్టడం సరైనది కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Reason behind Poor background score of Acharya. #Acharya #MegastarChiranjeevi #ManiSharma pic.twitter.com/OONqjsU5JR
— Raju Mandapati (@sreemandapati) November 28, 2022
ManiSharma Sir 🙏 & @MusicThaman anna ❤🙏 pic.twitter.com/imcC6j0iqd
— Kalyan Babu™ (@ram_aduri) November 29, 2022