తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు కోటి. ఒకప్పుడు రాజ్- కోటి మ్యూజిక్ అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనేవారు. కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు అద్భుతమైన హిట్స్ అందించారు కోటి. ఇటీవల సెహరి సినిమాతో సిల్వర్ స్క్క్రీన్‌పై నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ‘పగ పగ పగ ’అనే చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నారు.
వెండితెరపై తన సంగీతంతో మంత్ర ముగ్దులను చేసే మ్యూజిక్ డైరెక్టర్ కోటీ ‘పగ పగ పగ ’అనే చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో సత్యనారాయణ సుంకర నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అభిలాశ్ సుంకర, దీపికా ఆరాధ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు.
ఈ మూవీ కోటి ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను శుక్రవారం ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. ‘హలో పెజ్జొని పేటోడికి పనిఘిస్తే.. వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసే చస్తాడు’ అనే డైలాగ్ గ్లింప్స్‌లో కోటి సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీకి సంగీతం కోటి, కెమెరా నవీన్ కుమార్ చల్లా, సహ్మ నిర్మాత సత్యవతి. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Presenting Music Sensation @kotiSaluri Garu as Powerful Villan In #PagaPagaPaga 🔥
Launched by @MeherRamesh @raviwuyyuru @Abhilashsunkar5 #RaviSriDurgaPrasad #SatyanarayanaSunkara #Ramsunkara @naveenkumarchal #KAYPaparao #VijayPolaki @PROSaiSatish pic.twitter.com/EjKOJAFJEu
— Ramesh Bala (@rameshlaus) August 12, 2022