తెలుగు ఇండస్ట్రీకి “చిత్రం” సినిమాతో పరిచయం అయిన హీరో ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో సంచలన విజయాలతో స్టార్ హీరో మారిపోయాడు. పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను కేవలం మూడు సినిమాలతో అందుకుని అద్భుతాలు చేశాడు. అనంతరం కొన్నాళ్లకి కెరియర్ లో ఒడిదుడుకులను భరించలేని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పిన వాస్తవం ఏమిటనే ఉదయ్ కి మాత్రమే తెలుసు. తాజాగా సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఓ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన “అతడు” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాను మురళీమోహన్ సంస్థలైన జయభేరి ఆర్ట్స్ నిర్మించింది.ఈ సినిమా అప్పట్లో యువతకు ఎంతగానో నచ్చింది అంతేకాదు రికార్డులను సైతం కొల్లగొట్టింది. అయితే మురళీ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సినిమా కోసం మొదట వరుస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ ని హీరోగా చేయాలని మురళీ మోహన్ భావించారంట. అదే విషయాన్ని ఉదయ్ కిరణ్ తో ప్రస్తావిస్తే.. మూవీ చేయడానికి తన సిద్ధమంటూ కూడా మాట ఉదయ్ కిరణ్ ఇచ్చాడట. అయితే అతడు సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పట్టింది. ఈ మధ్యలో ఉదయ్ కిరణ్ కి మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితతో వివాహం నిశ్చయమైంది.
ఇక అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలు అరవింద్ చూసుకునే వారని, చివరికి ఉదయ్ కిరణ్ డేట్స్ కి సంబంధించిన డైరీ ని కూడా అరవింద్.. తన దగ్గరే పెట్టుకున్నాడట. ఎవరికి ఏ సినిమా ఒప్పుకోవాలి, ఎవరితో సినిమా చేయాలి, ఎన్ని డేట్స్ ఇవ్వాలి.. ఇలా అన్నీ కూడా అరవింద్ పర్యవేక్షణలోనే జరిగేవని మురళీమోహన్ ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే ఈ నిశ్చితార్ధానికి ముందే “అతడు” సినిమాకి ఒప్పుకున్నాడు కాబట్టి మురళీ మోహన్ ఉదయ్ కిరణ్ డేట్స్ అడగ్గా అరవింద్ ఖాళీ లేవని చెప్పడంతో ఉదయ్ కూడా ఏమీ చేయలేకపోయాడని అలా “అతడు” సినిమా ఉదయ్ నుంచి మహేష్ బాబుకు వెళ్లిందంటూ సంచలన నిజాలు బయట పెట్టాడు మురళీమోహన్.
ఆ తరువాత సుష్మితతో పెళ్లి క్యాన్సిల్ అవ్వడం జరగడంతో, అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా ఏ కారణాల చేతనో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ నుంచి వెళ్లిపోవడం, ఆ తరువాత అతడి కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడము ఆ తర్వాత ఆయన చనిపోవడం ఇవన్నీ కూడా మనం చూశాం. మరి.. ఉదయ్ కిరణ్ పై సీనియర్ నటుడు మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Meena: మీనా భర్తకి హేట్సాఫ్! కూతురి గురించి ముందే ఇలా చేసాడు!
ఇదీ చదవండి: Navya Swamy: చెత్త పనులు చేసి గొప్పగా బతకాలనుకోకు! : నవ్య స్వామి సీరియస్