Munawar Faruqui: మునావర్ ఫారుఖీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారిన పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ఈ స్టాండప్ కమెడియన్ హిందూ దేవుళ్లను కించపరిచేలా జోకులు వేసి వార్తల్లోకి ఎక్కాడు. ఇక అప్పటినుంచి అతడి షోలంటే రచ్చ మొదలవుతూ ఉంది. తాజాగా, హైదరాబాద్‌లో షోకు ప్లాన్ చేశాడు మునావర్. ఈ షోపై బీజేపీ నేత రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టేజి మీదే మునావర్‌పై దాడి చేస్తామని అన్నారు. పార్టీ వద్దని చెప్పినా విననని రాజాసింగ్ అన్నారు. రాజాసింగ్‌తో పాటు ఎంతో మంది హిందువులు మండిపడుతున్న మునావర్ ఎవరు? హిందువుల మనోభావాలు కించపరిచేలా ఏం కామెంట్లు చేశాడు? అన్న విషయాలు మీకోసం..
ఐదో తరగతి వరకు చదువు.. స్టాండప్ కమెడియన్‌గా ఫేమ్!
మునావర్ పూర్తి పేరు మునావర్ అబ్దుల్ ఫారుఖీ. అతడు 1992, జనవరి 28న గుజరాత్‌లోని జునగథ్‌లో జన్మించాడు. మునావర్‌ది పేద కుటుంబం కావటంతో.. చదువుకోవటానికి డబ్బులు లేని స్థితిలో 5లోనే చదువు మానేశాడు. 11 ఏళ్ల వయసునుంచి కూలీ పనికి వెళ్లే వాడు. 2002లో అతడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 2007లో కుటుంబం ముంబైలోని డోంగ్రీకి మారిపోయింది. ముంబైకి వచ్చిన కొన్నేళ్లకు స్టాండప్ కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. 2010లో ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. ఆనతి కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత 2020 ఫిబ్రవరి నెలలో మొదటి సారి స్టాండప్ కమెడియన్‌గా అతడి టెకెట్ షో ప్రారంభం అయింది. అదే నెలలో మునావర్ తండ్రి చనిపోయాడు.
రహస్యంగా పెళ్లి విషయాలు.. ప్రియురాలితో..
స్టాండప్ కమెడియన్‌గా రానిస్తున్న సమయంలోనే అతడికి పెళ్లయింది. ఓ బాబు కూడా పుట్టాడు. అయితే, తన పెళ్లి విషయాలను మునావర్ రహస్యంగా ఉంచుతూ వచ్చాడు. ‘‘లాకప్’’ షోలో తనకు పెళ్లయిందన్న విషయాన్ని మొదటి సారి చెప్పాడు.
భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులకు అప్లై చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నాయని వెల్లడించాడు. భార్యతో విడిపోయిన తర్వాత మునావర్ నజిలా సిటైసీతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ గత కొన్ని నెలలనుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.
మత వివాదంలో మునావర్
మునావర్ 2021లో హిందూ దేవళ్లయిన రాముడు, సీతను కామెడీ కోసం వాడుకున్నాడు. దేవుళ్లను కించపరుస్తూ కామెడీ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ కామెడీ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హిందువులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను కించపర్చినందుకు గానూ 2021 జనవరి నెలలో మధ్య ప్రదేశ్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. 35 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాతినుంచి అతడి షోలపై హిందువుల వ్యతిరేకత పెరిగిపోయింది. మరి, మునావర్ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రెగ్నెన్సీ విషయంలో అలా జరిగే సరికే చాలా డిస్ట్రబ్ అయ్యాను: చిన్మయి