సీతారామం సినిమాతో కుర్రకారు గుండెల్లో సీతగా నిలిచి పోయారు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. మొదటి సినిమాకే ఇంత క్రేజ్ రావటం మృణాల్‌కు మాత్రమే సాధ్యమైంది.
‘సీతారామం’ సినిమాతో సౌత్‌లో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ మధ్యకాలంలో మొదటి సినిమాకే ఇంత క్రేజ్ తెచ్చుకోవటం మృణాల్‌కు మాత్రమే సాధ్యం అయిందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందం, అభినయంతో తెలుగు నాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యూత్ చాలా మంది ఆమెకు కనెక్ట్ అయిపోయారు. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ క్రేజ్ రావటంతో మృణాల్‌కు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారట. ‘సీతారామం’ సినిమా కోసం ఆమె కేవలం రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు.
ఇప్పుడు అంతకు మించి అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్నారట. అయినా కూడా నిర్మాతలు వెనక్కు తగ్గటం లేదట. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వటానికి ఒప్పుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఆమె రెమ్యూనరేష్‌న్‌కు సంబంధించిన ఓ వార్త సినిమా సర్కిల్‌లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ సంగతేంటంటే.. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ హీరో నానీతో సినిమా కోసం అక్షరాలా 6 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. ఈ మొత్తం సౌత్‌లో టాప్ హీరోయిన్లు నయనతార, సమంతలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ల కంటే ఎక్కువే. సమంత, నయనతారలు ఆరు కోట్ల కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఈ లెక్కన చూసుకుంటే రెమ్యూనరేషన్ విషయంలో.. సౌత్‌లో మృణాల్ టాప్‌లో నిలిచినట్లే. మృణాల్ కొన్ని ఐటమ్ సాంగ్స్‌లోనూ నటించారు. అక్షయ్ హీరోగా వచ్చిన సెల్ఫీ సినిమాలో ఐటం సాంగ్ కోసం కోటి రూపాయలు తీసుకున్నారు. కాగా, మృణాల్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. గతంలో ఆమె నటించిన సీరియల్ ‘కుంకుమ భాగ్య’ తెలుగులో డబ్ అయింది. ఈ సీరియల్ ద్వారా ఆమె తెలుగు నాట కూడా సుపరిచితురాలయ్యారు. మరి, మృణాల్ ఠాకూర్ షాకింగ్ రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.