దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని పెద్దవాళ్లు చెప్పిన మాటలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు హీరోయిన్స్. ఒక్కసారి క్రేజ్ వచ్చాక దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని పెద్దవాళ్లు చెప్పిన మాటలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు హీరోయిన్స్. ఒక్కసారి క్రేజ్ వచ్చాక దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. సినిమాలతో పాటు యాడ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ వంటివి చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తుంటారు. ఇక వరుస ఆఫర్లతో పాటు సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కారంటే మాత్రం పారితోషికం పెంచేస్తుంటారు. హీరోల సంగతి పక్కన పెడితే.. హీరోయిన్ డబ్బులు డిమాండ్ చేసిందంటే మాత్రం ఆ న్యూస్ తెగ వైరల్ అయిపోతుంటుంది. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫుల్‌ఫామ్‌లో ఉంది. అమ్మడి కెరీర్ గ్రాఫ్ కూడా సక్సెస్ ఫుల్‌గానే కొనసాగుతుంది. దీంతో భారీగా పారితోషికం పెంచేసిందట.
‘సీతా రామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌ను ఫిదా చేసేసింది నార్త్ భామ మృణాల్. ఆన్ స్క్రీన్ ఎంత ట్రెడిషనల్‌గా కనిపించిందో.. ఆఫ్ స్క్రీన్ అంత ట్రెండీగా ఉంటుంది. ‘సీతా రామం’ తర్వాత మరో మూవీ రిలీజ్ కాకపోయినా కానీ అమ్మడి పేరు మాత్రం మార్మోగిపోతుంది. తెలుగులోకి రాకముందు రెండు మరాఠీ సినిమాలు, అరడజనుకి పైగా హిందీ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఒకే ఒక్క సినిమాతో సాలిడ్ క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవల ‘లస్ట్ స్టోరీస్ 2’ లో రచ్చ లేపింది. వచ్చిన పాపులారిటీనీ, క్రేజ్‌నీ క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యిన మృణాల్ భారీగా పారితోషికం పెంచేసిందట. ‘ఇంత ఇస్తేనే చేస్తా’ అని డిమాండ్ చేస్తుందనే న్యూస్ వైరల్ అవుతుంది.
‘సీతా రామం’ తర్వాత తెలుగులో మరో సినిమా చెయ్యడానికి బాగానే గ్యాప్ తీసుకుందీ భామ. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 30వ సినిమాలో కథానాయికగా కన్ఫమ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో పాటు ‘గీతగోవిందం’ కాంబో విజయ్ దేవరకొండ – పరశురామ్‌లతో దిల్ రాజు తెరకెక్కిస్తున్న సినిమాలోనూ మృణాల్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాకి పారితోషికంగా అక్షరాలా రూ.3.5 కోట్లు డిమాండ్ చేసిందట. అమ్మడి క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆమె అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ ఓకే చెప్పారని సమాచారం. ‘సీతా రామం’ కి మృణాల్ రెమ్యునరేషన్ రూ.80 లక్షలు. ఇప్పుడు రూ.3.5 కోట్లు. అంటే.. డబుల్, ట్రిపుల్ కాదు.. దాదాపు నాలుగు రెట్లు పెంచేసిందన్న మాట..