రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. 2022 అప్పుడే వెళ్ళిపోతుంది. 2023లోకి అడుగుపెట్టేస్తున్నాం. ఈ 2022వ సంవత్సరం.. ఈ 365 రోజుల్లో ఎన్నో జ్ఞాపకాలను, ఎన్నో అనుభవాలను మిగిల్చింది. ఎన్నో సినిమాలు చూసి ఆనందం పొందాం. కొన్ని సినిమాలు చూసి నిరుత్సాహపడ్డాం. భారీ అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య నుంచి అరవం సినిమా బీస్ట్, బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా వరకూ చాలా సినిమాలు ప్రేక్షకులను మస్తు డిజప్పాయింట్ చేసినాయి. పలానా హీరో, పలానా డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి బంపర్ మెజారిటీతో కలెక్షన్లు కొల్లగొడుతుందనుకున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాంబ్ పేల్చాయి. ప్రేక్షకులను నిరాశపరచడమే గాక నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టాయి. మరి ఆ సినిమాలేంటో ఓపాలి రివైండ్ చేసుకుందారేటి.
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ. ఒక అందమైన ప్రేమ కథని భారీ విజువల్స్ పెట్టి చాలా గ్రాండ్ గా చూపించారు. ఆ విజువల్ ట్రీట్ బాగున్నా గానీ ఎందుకో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డారు కూడా. కానీ కష్టానికి తగ్గా ఫలితం దక్కకుండా పోయింది. విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకి తీవ్ర నష్టాలను మిగిల్చింది.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో.. అపజయమెరుగని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది.
మోహన్ బాబు హీరోగా.. మంచు విష్ణు నిర్మాతగా.. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అపజయాన్ని మూటగట్టుకున్న ఈ సినిమా నిర్మాతకి భారీగా నష్టాలను మిగిల్చింది.
రవితేజ నటించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఈ సినిమాలతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి.
నితిన్, కృతి శెట్టి జంటగా వచ్చిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశపరిచింది.
రామ్ పోతినేని, లింగు సామి కాంబినేషన్ లో వచ్చిన ద్విభాషా చిత్రం ది వారియర్. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజయ్యింది. కానీ కలెక్షన్లను రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది.
శర్వానంద్ అంటే మంచి స్టోరీ సెలక్షన్ ఉంటుందని ప్రేక్షకుల గట్టి నమ్మకం. కానీ ఎందుకో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టడంలో విఫలమైంది.
వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ గని. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని, నిర్మాతలను నిరాశపరిచింది.
రణబీర్ కపూర్ నటించిన షంషేరా, ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఈ సినిమాలు బాలీవుడ్ లోనే కాక.. తెలుగులోనూ ఫెయిలయ్యాయి. తెలుగు రైట్స్ కొన్న నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి.
రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ఈ ఏడాదిలో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ నటించిన జిన్నా సినిమా కాసేపు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినా.. కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది.
ఇవే కాకుండా మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో, సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా, కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్, రాజ్ తరుణ్ నటించిన స్టాండప్ రాహుల్, శ్రీ విష్ణు నటించిన భళా తందనానా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా బాగుంటుంది. కానీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అలానే నాగచైతన్య నటించిన థాంక్యూ, కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి, రెజీనా, నివేద థామస్ నటించిన శాకిని డాకిని, నాగార్జున నటించి ది ఘోస్ట్, లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమాలు కథలు బాగున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో బలహీనమైన ప్రదర్శనను చూపించాయి. ఇలా ఈ ఏడాది విడుదలై కలెక్షన్ల పరంగా వీక్ గా పెర్ఫార్మ్ చేసాయి. మరి మీకు తెలిసిన సినిమాల్లో కమర్షియల్ గా ఫెయిలైన సినిమాలు ఉంటే కామెంట్ చేయండి.