కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో మూవీ లవర్స్ తెగ బాధపడ్డారు. ఇక ఇదే టైమ్ లో ఓటీటీలు రంగప్రవేశం చేయడంతో ప్రేక్షకులు అటువైపు మళ్లారు. దాంతో కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత కూడా థియేటర్లకు జనాలు రావడం తగ్గించేశారు. అదీకాక థియేటర్లలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నందు వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని కొందరి వాదన. ఈ నేపథ్యంలోనే ఓ మల్టీప్లెక్స్ యాజమాన్యం మూవీ లవర్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే? రూపాయికే టికెట్ ను విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ మల్టీప్లెక్స్ ఎక్కడో లేదండోయ్.. మన హైదరాబాద్ లోనే ఉంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఈ రోజుల్లో ఓ వ్యక్తి సినిమాకి వెళ్తే తక్కువలో తక్కువ 200 రూపాయలు అవ్వడం ఖాయం. ఇది సాధారణ థియేటర్లలో మాత్రమే. అదే మల్టీప్లెక్స్ ల్లో అయితే 500 రూపాయల పై మాటే. ఇలాంటి తరుణంలో ఓ థియేటర్ యజమాని సినిమా ప్రియులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు. హైదరాబాద్ లోని మౌలాలిలో మూవీ మ్యాక్స్ AMR పేరుతో ఓ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ మల్టీప్లెక్స్ ను డిసెంబర్ 15న గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నారు యజమానులు. ఓపెనింగ్ ఆఫర్ లో భాగంగా ఆ రోజు మెుత్తం కేవలం ఒక్క రూపాయకే టికెట్లు అమ్ముతున్నట్లు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది.
ఈ మల్టీప్లెక్స్ లో మెుత్తం 11 సినిమాలను ప్రదర్శించనున్నట్లు యాజమాన్యం చెప్పుకొచ్చింది. యశోద, లవ్ టుడే, మసూద, గుర్తుందా శీతాకాలం, హిట్ 2, పంచతంత్రం, చెప్పాలని ఉంది, కాంతార, భేడియా, దృశ్యం2 సినిమాలను ప్రదర్శించనున్నారు. బుక్ మై షో, అమెజాన్ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లల్లో టిక్కెట్ లను విక్రయానికి ఉంచినట్లు థియేటర్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్రారంభ ఆఫర్ ను మూవీ లవర్స్ ఉపయోగించుకోవాలిని సూచించింది. కుటుంబం మెుత్తంతో కలిసి సినిమా చూడాలి అనుకునే వారికి ఇదో అద్భుతమైన ఆఫర్.
9:15AM – #Masooda
12:30PM – #LoveToday
3:30PM – #GurthundaSeethakalam
6:30PM – #Hit2All these movies you can watch for just 4 rupees altogether on 15th Dec (Thursday) @ AMR MOVIE MAX, Moula Ali, Hyd as an introductory offer. Grab!!! Fast!!! @bookmyshow
— Cinema Madness 24*7 (@CinemaMadness24) December 10, 2022