యూట్యూబ్‌ని బాగా ఫాలో అయ్యే వారు మూవీ రివ్యూయర్ లక్ష్మణ్ పేరు చెప్పగానే గుర్తు పడతారు. ఇక విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అయ్యాడు. ఈ ప్రాంక్ వీడియో కారణంగా లక్ష్మణ్ గురించి ఎక్కువమందికి తెలిసింది. ఇక శుక్రవారం సినిమా విడుదలయ్యిందటే చాలు చాలా మంది యూట్యూబ్‌లో వచ్చే లక్ష్మణ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తారు. రివ్యూ చెప్పేటప్పుడు అతడు చేసే యాక్షన్ చూసి పడి పడి నవ్వుకుంటారు. ఇక రివ్యూ సమయంలో లక్ష్మణ్ వేసే పంచులకు పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఇలా రివ్యూలు చెప్పే లక్ష్మణ్ బాగా ఫేమస్ అయ్యాడు. అయితే చాలా మంది రివ్యూ చెప్పే సమయంలో అతడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడని.. అదంతా ఫేక్ అని విమర్శిస్తారు. డబ్బులిచ్చి ఇలా సినిమా ప్రమోషన్ చేయించుకుంటారనే టాక్ కూడా ఉంది.
ఇది కూడా చదవండి: Vishwak Sen: దేవీ నాగవల్లికి విశ్వక్ సేన్ థ్యాంక్స్ చెప్పాలంటూ కొత్త డిమాండ్..!
ఈ క్రమంలో తాజాగా సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ ఈ విమర్శలు, కామెంట్లపై స్పందించాడు. తాను చేసేది ఓవర్ యాక్షన్ కాదని.. సినిమా గురించి తాను ఏం ఫీలయితే.. అదే చెప్తానని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
ఇది కూడా చదవండి: Vishwak Sen: సినిమా హిట్ తో రెచ్చిపోయిన విశ్వక్ సేన్! మాస్ స్టెప్పులతో రచ్చ!