ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారు మోగుతున్న పేరు లైగర్. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు మందుకు రానుంది. రౌడీహీరో విజయ్ దేవరకొండ, అనన్య జంటగా నటించిన ఈ చిత్రంలో.. మైక్ టైసన్ తొలి సారి తెరపై కనపించనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఓ రేంజ్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా లైగర్ టీమ్ సందడి చేసింది. ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది ఈ చిత్ర బృందం. ఈ క్రమంలో విజయ్‌కి ఓ విలేకరి నుంచి కాస్త ఆసక్తికరమైన ప్రశ్న వినిపించింది. ఏ హీరోని అయినా సరే మీ సినిమా ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తే.. ఎవరికైనా ఎంత కోపం వస్తుంది.. సదరు విలేకరిని చెడామడా తిట్టి పడేస్తారు. సేమ్ ఇదే పరిస్థితి ఎదురయ్యింది విజయ్ దేవరకొండకి. లైగర్ ఫ్లాప్ అయితే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాడు ఓ విలేకరి.. అందుకు విజయ్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరలవుతుంది. ఆ వివరాలు..
ఈ క్రమంలో తాజాగా లైగర్ టీం ముంబైలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ విలేకరి నుంచి విజయ్‌కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకవేళ లైగర్ ఫ్లాప్ అయితే.. పరిస్థితి ఏంటి అని సదరు విలేకరి విజయ్‌ని అడిగాడు. అందుకు విజయ్ కూల్‌గానే స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు.
‘ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కోపంతో ఊగిపోనవసరం లేదు. ఇదే ప్రశ్న నన్ను కొన్నేళ్ల కిందట అడిగి ఉంటే కోపంతో ఊగిపోయేవాడిని. ఇలా అడిగినందుకు మీపై విరుచుకుపడేవాడినేమో.. తిట్టేవాడినేమో. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువ. కానీ గత కొన్ని రోజులుగా నాకసలు కోపమే రావడం లేదు. ఎందుకంటే అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని వారిని నేను అగౌరవ పరచలేను’ అని వ్యాఖ్యానించాడు.
అనంతరం ‘లైగర్ ప్రమోషన్స్ కోసం దేశమంత పర్యటిస్తున్నాం. ఎక్కడికి వెళ్లిన ప్రేక్షకులు మా మీద అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. వారి అభిమానాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకు ప్రేక్షకులే ముఖ్యం. వారి కోసమే మేం పని చేస్తున్నాం. ప్రేక్షకులను నేరుగా కలిసి వారి హృదయాలను గెలుచుకునేందుకే నగరాలన్ని చూట్టుముడుతున్నాం’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక అతడి రియాక్షన్ చూసి అంతా షాకయ్యారు.
పాన్ ఇండియా చిత్రమైన ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఫ్లాప్ అని ప్రస్తావిస్తే ఎవరైనా సరే.. వారిపై కోపంతో ఊగిపోవాల్సిందే. కానీ విజయ్ సదరు విలేకరితో వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మాటలతో రౌడీ హీరోపై తమకు మరింత అభిమానం పెరిగిపోయిందంటూ విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.