ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. కారణాలు ఏదైతేనేం తుదిశ్వాస విడుస్తున్నారు. ప్రేక్షకులు, కుటుంబసభ్యుల్ని శోకసంద్రంలో ముంచెస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఓ సంఘటన మాత్రం చాలా షాకింగ్ గా అనిపించింది. తాజాగా ఓ నిర్మాత, తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అలా పడి ఉండటానికి కారణాలు ఏంటా అని ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత జైసన్ జోసెఫ్(44) విగతజీవిగా కనిపించారు. కొచ్చిలోని తన అపార్ట్ మెంట్ లో శవమై పడి ఉన్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అలానే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానాకి చేరుకున్న పోలీసులు.. ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం.. బాడీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతిపట్ల మలయాళ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మలయాళంలో పలు హిట్ సినిమాలని నిర్మించిన జోసెఫ్.. కేరళ నిర్మాతల సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. కుంచకో బోబన్ యాక్ట్ చేసిన ‘జమ్నా ప్యారీ’ సినిమాని నిర్మించింది ఈయనే. 2017లో బిజు మేనన్ యాక్ట్ చేసిన ‘లవకుశ’ ప్రొడ్యూస్ చేసింది కూడా జోసెఫే. ఇదిలా ఉండగా చిన్నవయసులోనే ఆయన ఇలా చనిపోవడం బాధాకరమని పలువురు నటీనటులు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం జోసెఫ్ మృతి మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Kerala: film producer jaison joseph found dead in kerala #kerala #producer #jaisonjoseph #filmproducer pic.twitter.com/JIVXK2pSYh
— FilmiBeat (@filmibeat) December 6, 2022