ప్రతి నెల అన్ని భాషలలో ఆయా స్టార్స్ క్రేజ్, ట్రెండ్ బట్టి అందరు హీరోలను వరుసగా నెంబర్స్ ప్రకారం లిస్ట్ రెడీ చేస్తుంది ఓర్మాక్స్ మీడియా. ఆ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈసారి ఎవరు టాప్ లో ఉన్నారనేది తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్.
సాధారణంగా సినీ తారల స్టార్డమ్ ని గుర్తుచేస్తూ ఎప్పటికప్పుడు కొన్ని పాపులర్ మీడియా సంస్థలు లిస్ట్ రిలీజ్ చేస్తుంటాయి. ప్రతి నెల ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి మోస్ట్ పాపులర్ స్టార్స్ ఎవరు అనేది ఓ ప్రణాళిక వేసి జాబితా వదులుతుంటాయి. అలా రెగ్యులర్ గా మోస్ట్ పాపులర్ స్టార్ లిస్ట్ ని రిలీజ్ చేసే ఇండియన్ సంస్థలలో ఓర్మాక్స్ ఒకటి. ప్రతి నెల అన్ని భాషలలో ఆయా స్టార్స్ క్రేజ్, ట్రెండ్ బట్టి అందరు హీరోలను వరుసగా నెంబర్స్ ప్రకారం లిస్ట్ రెడీ చేస్తుంది. తాజాగా 2023 జనవరికి సంబంధించి తెలుగు మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్ రిలీజ్ చేసింది ఓర్మాక్స్ మీడియా. ప్రస్తుతం ఆ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈసారి ఎవరు టాప్ లో ఉన్నారనేది తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఓర్మాక్స్ లిస్ట్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో మోస్ట్ పాపులర్ స్టార్ గా మొదటి స్థానంలో నిలిచాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. లాస్ట్ ఇయర్ రాధేశ్యామ్ తర్వాత మళ్లీ ప్రభాస్ నుండి ఏ మూవీ రిలీజ్ కాలేదు. కానీ.. ప్రభాసే జనవరిలో నెంబర్ 1 గా నిలవడం విశేషం. కాగా.. ఆదిపురుష్ కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్, ప్రాజెక్ట్ K, మారుతీతో ఓ సినిమా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నాడు. ప్రభాస్ తర్వాత.. రెండో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మూడో స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. వీరిద్దరూ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు.
ఈ విధంగా చూసుకుంటే.. నాలుగు, ఐదు స్థానాలలో అల్లు అర్జున్, మహేష్ బాబు నిలిచారు. పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకొని.. ప్రెసెంట్ పుష్ప 2 చేస్తున్నాడు బన్నీ. ఇక గతేడాది సర్కారు వారి పాటతో అలరించిన మహేష్.. ఇప్పుడు త్రివిక్రమ్ తో SSMB28 చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. అలా ఆరో స్థానంలో పవన్ కళ్యాణ్.. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తో మెగాస్టార్ చిరంజీవి ఏడవ స్థానాలలో నిలిచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. వీరమల్లు కాకుండా వినోదయ సితం, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లైఫ్ చేశారు. ఇక 8, 9, 10 స్థానాలలో నాని, రవితేజ, విజయ్ దేవరకొండ నిలిచారు. ప్రస్తుతం ఈ లిస్ట్ వైరల్ అవుతున్నప్పటికీ.. నెల నెలా వీరి స్థానాలలో మార్పులు జరగడంక, కొత్త వాళ్ళు లిస్ట్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. మరి మీ అభిమాన హీరో ఈ లిస్టులో ఉన్నాడో లేడో కామెంట్స్ లో తెలియజేయండి.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Jan 2023) #OrmaxSIL pic.twitter.com/mvLIlcTUm2
— Ormax Media (@OrmaxMedia) February 15, 2023