ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు కొత్త మూవీని తీసుకొచ్చింది. ఫ్యామిలీ డ్రామాలతో పాటు బోల్డ్ కంటెంట్ ని అందించే నెట్ ఫ్లిక్స్.. 'మనీ షాట్; ది పో*ర్న్ హబ్ స్టోరీ' మూవీని తాజాగా రిలీజ్ చేసింది. ఈ మూవీ ప్రముఖ వెబ్ సైట్ 'పోర్న్ హబ్' నేపథ్యంలోనే తెరకెక్కింది. మరి ఈ మూవీ సంగతేంటీ అనేది రివ్యూలో చూద్దాం!
వరల్డ్ వైడ్ పాపులర్ అయిన స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు కొత్త మూవీని తీసుకొచ్చింది. ఫ్యామిలీ డ్రామాలతో పాటు బోల్డ్ కంటెంట్ ని అందించే నెట్ ఫ్లిక్స్.. ‘మనీ షాట్; ది పో*ర్న్ హబ్ స్టోరీ’ మూవీని తాజాగా రిలీజ్ చేసింది. ఈ మూవీ ప్రముఖ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ సైట్ పేరు వినగానే అందరికీ ఒక్కసారిగా అడల్ట్ మూవీస్, వీడియోల వైపు దృష్టి వెళ్తుంది. ఒకానొక దశలో పోర్న్ హబ్ అనేది వరల్డ్ వైడ్ పాపులర్ అడల్ట్ సైట్ గా ఎదిగింది. అలాంటి సైట్ ఒక్కసారిగా వివాదాస్పద ఆరోపణలు ఫేస్ చేస్తూ.. బిజినెస్ కోల్పోయింది. ఈ సినిమాలో అసలు పోర్న్ హబ్ ఇష్యూ వెనుక ఏం జరిగింది? అనేది చర్చించారు. మరి ఈ మూవీ సంగతేంటీ అనేది రివ్యూలో చూద్దాం!
తాజాగా విడుదలైన ‘మనీ షాట్; ది పోర్న్ హబ్ స్టోరీ’.. అన్ని అడల్ట్ మూవీస్ లాగే అదే కంటెంట్ తో వచ్చింది అనుకుంటే పొరపాటే. ఇది కేవలం పో*ర్న్ హబ్ సైట్ పతనానికి కారణం? దాని వెనుక ఎలాంటి రాజకీయాలు జరిగాయి? అనే విషయాలు చర్చిస్తూ.. డాక్యుమెంటరీ ఫిల్మ్ లా రూపొందించారు డైరెక్టర్ సుజానే హిల్లింగర్. ఇక మూవీ విషయానికి వస్తే.. పో*ర్న్‌హబ్ ఎదుర్కొన్న వివాదాలను పరిచయం చేస్తూనే.. ఇందులో కొన్ని కొత్త విషయాలను టచ్ చేశారు. పో*ర్న్ హబ్ ఎదుగుదల.. మైనర్ సె*క్స్ వీడియోలు పోస్ట్ చేయడం.. రే*ప్ లాంటి వీడియోలను పెట్టి.. ఎలాంటి వ్యతిరేకతను చవిచూసిందో చూపించారు.
ఆ విధంగా సైట్ గురించి చెబుతూ.. పో*ర్న్ హబ్ సక్సెస్ కి, ఫెయిల్యూర్స్ కి కారణాలు కూడా చూపించారు. పో*ర్న్ హబ్ కూడా మొదట అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లాగే పాపులర్ అయ్యింది. అయితే.. ట్రాఫిక్ ను పెంచుకోవడానికి అల్గారిథమ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, SEO లను ఫాలో అయ్యిందని చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక క్రేజ్, ఫాలోయింగ్ వచ్చేదాకా.. అడల్ట్ వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి వేదికగా ఉన్న పో*ర్న్ హబ్.. ఆ తర్వాత సొంతంగా స్టూడియోలు పెట్టి, అడల్ట్ యాక్టర్స్ కి అవకాశాలు క్రియేట్ చేసింది. ఆ విధంగా ఒక ఫ్లోలో డెవలప్ అవుతూ వచ్చిన పో*ర్న్ హబ్ కి అసలు సమస్య కూడా అక్కడే మొదలైంది. పో*ర్న్ హబ్.. సెక్స్-ట్రాఫికింగ్, రివెంజ్ పో*ర్న్, స్పైక్యామ్ వీడియోస్.. లాంటి క్రిమినల్ కంటెంట్ పోస్ట్ చేస్తోందని.. 2020లో న్యూయార్క్ టైమ్స్ క్లెయిమ్ చేసిన కవర్ స్టోరీని ఇందులో హైలైట్ చేశారు.
ఈ సైట్ ని మూసివేయాలని, దాని ఎగ్జిక్యూటివ్ లను జవాబుదారీలుగా ఉంచాలని ‘ట్రాఫికింగ్ హబ్’ పిటిషన్ వేసిన ట్విస్ట్ బాగుంది. యాంటీ-పో*ర్నోగ్రఫీ, యాంటీ-ట్రాఫికింగ్ NCOSE (నేషనల్ సెంటర్ ఆన్ సె*క్స్ ఎక్స్‌ప్లోయిటేషన్), ట్రాఫికింగ్ హబ్ వ్యవస్థాపకురాలు లైలా మికెల్‌వైట్.. NYT రచయిత నికోలస్ క్రిస్టోఫ్ ఇద్దరూ.. తమ కథనాలతో వ్యతిరేకతను స్ప్రెడ్ చేశారని చూపించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ అయినప్పటికీ.. ఆడియెన్స్ కి సినిమాటిక్ ఫీల్ ఇవ్వడానికి ఇలా ట్రై చేశారేమో! ఇక మరో హైలైట్ ఏంటంటే.. కేవలం పో*ర్న్‌హబ్ ఇష్యూ గురించే కాకుండా జనరల్ గా పో*ర్న్ ఇండస్ట్రీలో ఏర్పడే సమస్యలను రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేయడం.
ఇక్కడే సినిమాలో ఓ మైనస్ కూడా చేశారు. పో*ర్న్ హబ్ ఇష్యూ అయినప్పుడు.. మాస్టర్ కార్డ్, వీసా లాంటి చెల్లింపు కంపెనీలు సైట్ నుండి వైదొలిగాయని ఇందులో చూపించారు. అలా చేయడం వలన అందులో ఉన్న యాక్టర్స్, సభ్యులు ఆదాయం కోల్పోయారని చెప్పుకొచ్చారు. కానీ.. భారీ సెక్స్ ట్రాఫికింగ్ స్కామ్ ని ఇంటర్నెట్ ఇన్ జనరల్ సమస్యగా కాకుండా పో*ర్న్‌హబ్ సమస్యగా రూపొందించడం మైనస్ పాయింట్. ప్రస్తుతం ఈ మూవీ.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో రియల్ పో*ర్న్ స్టార్స్ జెన్ ఆడోరా, అసా అకిరా, సిరి డాల్ కనిపించి.. వారి అనుభవాలను షేర్ చేసుకుంటారు. మొత్తానికి డైరెక్టర్ సుజానే హిల్లింగర్ చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా చెప్పలేకపోయాడేమో అనిపిస్తుంది. అన్నట్లు ఈ మూవీ ఇంగ్లీష్ తో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ ‘మనీ షాట్; ది పో*ర్న్ హబ్’ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.