మోనాలిసా గురించి సినీ ప్రియులకు ముఖ్యంగా భోజ్ పురి ప్రేక్షకులను పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. మోనాలిసా అనేక భోజ్‌పురి మరియు హిందీ సినిమాల్లో నటించారు. మూవీస్ తో పాటు సోషల్ మీడియాలో ఆమె నిత్యం సంచనలం రేపుతుంటారు. ఈమె గతంలో బిగ్ బాస్ 10 కూడా పాల్గొంది. మోనాలిసాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తన ఫోటోలను, డ్యాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా మోనాలిసాకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు.. ఎందుకు మోనాలిసా ఇంతటి సాహసం చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ వీడియోలో మోనాలిసా తన శరీరం మొత్తానికి పశువుల పేడ పూసుకుంది. తల నుంచి కాలి వేళ్ల వరకు బాడీ అంతటికీ పేడను నిండుగా రాసుకుంది. అయితే ఆ పేడ కారణంగా ఆమెకు దురద వచ్చింది. ఆ బాధను భరించలేక మోనాలిసా మెలికలు తిరిగిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఇదేదో కామెడీ షో కోసం యాక్టింగ్ చేసినట్లు ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో నాచ్ బలియే డ్యాన్స్ షోలో పాల్గొన్న ఈ అమ్మడు.. ఇటీవల స్మార్ట్ జోడీ అనే షోలో భర్త విక్రాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి పాల్గొంది.
ఇక ఆ షోలో మోనాలిసా దంపతలు ఓ రేంజ్ లో సందండి చేశారు. ఈక్రమంలో షోలో మోనాలిసా మాట్లాడుతూ.. సినిమాల్లో తాను పోషించిన పాత్రలు చూసి జనాలు అసహ్యించుకునేవారని తెలిపింది. ఇక ఇటీవల ఈమె రాత్రి కే యాత్రి-2 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో హంగామా ప్లే అనే ఓటీటీలో ప్రసారం కానుంది. మరి.. మోనాలిసా సంబంధించిన వైరల్ అవుతున్న ఈ పాత వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.