చిరంజీవి వారసుడు రామ్ చరణ్ హీరోలు, నాగార్జున వారసులు చైతూ, అఖిల్, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా ఇలా హీరోల వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య లెజెండ్ సినిమాలో నటిస్తున్నాడని, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవన్నీ రూమర్లని తేలిపోయింది. లెజెండ్ మూవీ మేకింగ్ సీన్స్ లో కనిపించాడు అంతే, ఇక ఆ తర్వాత మోక్షజ్ఞ కనబడలేదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మోక్షజ్ఞ తెరపైకి వచ్చాడు.
ఇవాళ(సెప్టెంబర్ 6 1994) మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ ఇంట్లో బర్త్ డే వేడుకలు జరిగాయి, బాలకృష్ణ తన కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ.. తన కుమారుడితో కేక్ కట్ చేయించారు. అనంతరం మోక్షజ్ఞకి కేక్ తినిపించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూసిన అభిమానులు మా నందమూరి వారి వారసుడొచ్చాడు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలో మోక్షజ్ఞ కటౌట్ చూస్తుంటే హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Natasimha #NandamuriBalakrishna celebrates his son#NandamuriMokshagna‘s birthday#HBDNandamuriMokshagna pic.twitter.com/TyY2BOeX2H
— Vamsi Kaka (@vamsikaka) September 6, 2022