సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలకు అభిమానులు ఉన్నా.. వారంతా కొంతమంది హీరోల సక్సెస్ ని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. అలా తమ ఫేవరేట్ కాకపోయినా సక్సెస్ కోరుకునే హీరోలలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. పేరుకు మలయాళం హీరో అయినా.. ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ క్రేజ్ ఉంది. ఎందుకంటే.. మోహన్ లాల్ ఎక్కువగా కంటెంట్ బేస్‌డ్ మూవీస్ చేస్తుంటారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న మోహన్ లాల్.. ఎన్నో బెస్ట్ పెర్ఫార్మన్స్ లతో, బెస్ట్ మూవీస్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే.. 60 ఏళ్ళు పైబడినా మన్యంపులి(రూ. 100 కోట్లు), గాడ్ ఫాదర్(రూ. 150 కోట్లు) లాంటి బ్లాక్ బస్టర్స్ చేసిన ఆయన.. ఈ మధ్య కథల పరంగా తడబడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా ‘దృశ్యం 2′(ఓటిటి) హిట్ తర్వాత ఆ స్థాయి సినిమా రాలేదు. మధ్యలో కొన్ని (బ్రో డాడీ, ఆరాట్టు, 12త్ మ్యాన్, మాన్‌స్టర్) సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. మోహన్ లాల్ తెరపై కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా పండగ చేసుకుంటారో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా భారీ లెవెల్ లో వసూల్ అవుతుంటాయి. అలాంటిది తాజాగా మోహన్ లాల్ నుండి ఊహించని డిజాస్టర్ వచ్చి.. అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్ లాల్ నటించిన ‘అలోన్’ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కమర్షియల్ గా మోహన్ లాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మోహన్ లాల్ సినిమా అంటే తక్కువలో తక్కువగా మోస్తరు వసూళ్లు అయినా నమోదు అవుతుంటాయి. అలాంటిది ‘అలోన్’ సినిమా కనీసం థియేటర్స్ ఖర్చులు కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు. మలయాళంలో మొదటి 100 కోట్ల సినిమా, మొదటి 150 కోట్ల సినిమాల రికార్డు సెట్ చేసింది మోహన్ లాలే. అటువంటి ఆయనకి ఇలాంటి దారుణమైన డిజాస్టర్ పడటం ఘోర అవమానమేనని భావిస్తున్నారు ప్రేక్షకులు. దాదాపు రూ. 2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఫస్ట్ డే 40 లక్షలు, సెకండ్ డే 8 లక్షలు.. ఇలా మొదటి వారంలో కేవలం 70 లక్షలు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా చుశాక.. మోహన్ లాల్ కథలు వింటున్నాడా? లేక గుడ్డిగా చేసుకుంటూ పోతున్నాడా? అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి త్వరలోనే సాలిడ్ కంబ్యాక్ తో వస్తాడేమో చూడాలి.
Big Disaster! #Alone #alonemovie #Mohanlal #Lalletan
Follow us 👉 @tollymasti pic.twitter.com/E2wDMpFxHu— Tollymasti (@tollymasti) January 31, 2023