మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఓ కేసు విషయమై టెన్షన్ వెంటాడుతోందని సినీవర్గాలు చెబుతున్నాయి. తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతాలు పెట్టుకున్నారని నమోదైన కేసులో విచారణకు సహకరించాల్సి ఉంటుంది. తనపై ఉన్నటువంటి కేసును హైకోర్టులో మనవి చేసుకున్నప్పటికీ.. అటవీ శాఖ అధికారులు మాత్రం మోహన్ లాల్ పై ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారని నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మోహన్ లాల్ కు చుక్కెదురైంది.
గతంలో ఈ కేసు విషయమై థర్డ్ పార్టీ జోక్యం తగదని ట్రయల్ కోర్టు విచారణను తోసిపుచ్చింది. అయితే.. ఇద్దరు వ్యక్తులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చెయ్యడంతో కేరళ హైకోర్టు వారి వాదనలు వినేందుకు అనుమతినిచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మోహన్ లాల్ కు మళ్లీ ఏనుగు దంతాల కేసు టెన్షన్ మొదలైయ్యిందట. సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా ఏనుగు దంతాలు కనిపిస్తే వారికి మూడు నుండి ఏడూ సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.కొంతకాలం కిందటే ఆదాయపన్ను శాఖ(ఐటీ శాఖ) అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు చేసి.. అయన ఇంట్లో రెండు ఏనుగు దంతాలు గుర్తించారు. అయినా ఆ టైంలో మోహన్ లాల్ పై కేసు నమోదు చేయకుండా వదిలేశారట ఐటీ అధికారులు. అయితే.. ఐటీ వారు విడిచిపెట్టినా.. కేరళ అటవీశాఖ అధికారులు ఆయనను టార్గెట్ చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలు పెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు.
Actor #Mohanlal will have to face trial in the wildlife crime case booked against him for the illegal possession of two pairs of ivory as a trial court dismissed the State government’s plea to withdraw the prosecution proceedings, reports @kssudhihttps://t.co/odFX9zifBm
— The Hindu – Kerala (@THKerala) June 9, 2022
అదే సమయంలో ఇద్దరు సామాజిక కార్యకర్తలు జేమ్స్ మ్యాథ్యూ, ఏఏ పౌలోస్ కలిసి ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్న మోహన్ లాల్ మీద చర్యలు తీసుకోవాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. అనంతరం హైకోర్టులో పిటీషన్ వేసి ఆ కేసు విచారణ నిలిపివేయాలని మోహన్ లాల్ కూడా కోర్టుకు మనవి చేశారు. కానీ తాజాగా హైకోర్టు సామాజిక కార్యకర్తల మనవి మేరకు విచారణకు సహకరించాలని మోహన్ లాల్ కు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన త్వరలోనే విచారణలో పాల్గొనాల్సి ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంలో మోహన్ లాల్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు. మరి మోహన్ లాల్ కేసు విషయమై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.