మోహన్ బాబు.. ఇండియన్ సినిమా గర్వించతగ్గ అతికొద్ది మంది నటులలో ఈయన ఒకరు. కెరీర్ తొలినాళ్లలో విలన్ గా, ఆ తరువాత కమెడియన్ గా, ఆ తరువాత హీరోగా ఆయన సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు వయసు 69 సంవత్సరాలు. ఇలా వయసు పైనపడటంతో ఈ అసెంబ్లీ రౌడీ కొన్ని ఏళ్లుగా నటనకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ.., తాజాగా ఈయన సన్నాఫ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. చిన్న చిత్రాల రచయత, దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా సన్నాఫ్ ఆఫ్ ఇండియా చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తమిళ సూపర్ స్టార్ సూర్య ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో అదరగొట్టారు. మోహన్ బాబు రోల్ను వివరిస్తూ చిరంజీవి చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక మోహన్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. “మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను’. ‘తన రూటే సపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో.. ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో.. ఆ దేవుడికే ఎరుక” అంటూ ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర స్వభావాన్నిచిరంజీవి తెలియచేయడం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. చిరు చెప్పిన డైలాగ్స్ కి తగ్గట్టే ఈ సినిమాలో డైలాగ్ కింగ్ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు . అంతేకాదు టీజర్ ఆసాంతం చాలా రిచ్ గా కనిపిస్తుండటంతో .., ఎక్కడా ప్రొడక్షన్ పరంగా కాంప్రమైజ్ అయినట్టు అనిపించడం లేదు. మరి.., చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఓ పవర్ ఫుల్ రోల్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్న మోహన్ బాబు.. సన్నాఫ్ ఆఫ్ ఇండియా మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. అలాగే.. సన్నాఫ్ ఆఫ్ ఇండియా టీజర్ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.