వజ్రోత్సవ వేడుకల సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటు చేసుకున్న సంఘటనను ఎవరూ మర్చిపోలేరు. అప్పటి నుంచి ఈనాటికీ అది ఒక మాయని మచ్చలా ఉంది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవిని సోదరుడిగా భావించి ఆయనతో కలవడం.. సొంత అన్నలా చిరంజీవి పట్ల ప్రేమను కురిపించడం వంటి సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్, నెటిజన్స్ మాత్రం ఆనాటి సంఘటనలను ఏదో ఒక సమయంలో తెరపైకి తెస్తుంటారు. ఈ క్రమంలో ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు. అలానే మా ఎలక్షన్స్ సమయంలో చిరు వర్గం, మోహన్ బాబు వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయి విబేధాలు చోటు చేసుకున్న విషయంపై కూడా స్పందించారు. చిరంజీవి విషయంలో ఇప్పటికీ ఆ పెయిన్ ఉందని అన్నారు.
ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు ఉన్నట్టు ఇంకెవరూ ఉండరు. టామ్ అండ్ జెర్రీల్లా ఉంటారు. ఏమైనా అభిప్రాయబేధాలు వస్తే మోహన్ బాబు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం.. చిరంజీవి మన మోహన్ బాబే కదా అని ఆయన మాటలను పాజిటివ్ గా తీసుకోవడం చేస్తుంటారు. టామ్ అండ్ జెర్రీలా ఉన్నా కూడా ఎప్పుడైనా సందర్భం వస్తే వీళ్ళు కలిసినంత ఆప్యాయంగా మరెవరూ ఉండరేమో అనేంత క్లోజ్ రిలేషన్ షిప్ కలిగి ఉంటారు. ఒకే తండ్రికి పుట్టిన పిల్లల్లా, సొంత అన్నదమ్ముల్లా, సన్నిహితుల్లా చాలా బాగా కలిసిపోతారు. అయితే వీరు ఎంత కలిసి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ చాలా మందిని వెంటాడే సందేహాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో వజ్రోత్సవ వేడుకల్లో జరిగిన సంఘటన. అప్పట్లో మోహన్ బాబు
ఆయన 71వ పుట్టినరోజు సందర్భంగా తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. వజ్రోత్సవాల సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య వివాదం జరగడం అనేది ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా నానుతోంది. దీనిపై మీ సమాధానం ఏమిటని జర్నలిస్ట్ ప్రభు మోహన్ బాబుని అడిగారు. దానికి సమాధానంగా మోహన్ బాబు.. ‘సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి. నిజాలేంటి, అసత్యాలేంటి? ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, ఆత్మీయుల మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయి. భారత, రామాయణం చూసాం. కాబట్టి అది నథింగ్. ఆ విషయాలు వద్దు. వేరే విషయాలు అడగండి’ అని అన్నారు.
తాము ఇప్పుడు చాలా సంతోషంగా, అన్నదమ్ముల్లా ఉన్నామన్న సంకేతాన్ని ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇక మా ఎలక్షన్స్ లో జరిగిన గందరగోళంపై కూడా మోహన్ బాబు స్పందించారు. మా అసోసియేషన్ ఎలక్షన్ సమయంలో చిరంజీవి, మోహన్ బాబు వర్గాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. చిరంజీవి వర్గం ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేస్తే.. మిగతా వర్గం వారు మంచు విష్ణుకి మద్దతు పలికారు. ఈ క్రమంలో మోహన్ బాబు, చిరంజీవి మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇదే విషయాన్ని జర్నలిస్ట్ ప్రభు అడగ్గా.. మోహన్ బాబు స్పందించారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అనేది ఒక చరిత్ర. ఆశ్చర్యపోతుంటాను ఎందుకంటే మంచు విష్ణు విజయాన్ని సాధించాడు. విష్ణు చెప్పినవన్నీ చేశాడు.
బిల్డింగ్ ఒకటే తప్ప మిగతా పనులు అద్భుతంగా చేశాడు. కాదని పగవాడు కూడా చెప్పలేడు. ఊరికే జోక్ గా కామెంట్స్, అవి ఇవి తప్ప.. అవి ఎవడు చూస్తాడు పిచ్చోడు తప్ప’ అని అన్నారు. అయితే ఆ మనసు కష్టం కూడా చిరంజీవికి, నాకు రాకూడదని అనిపించింది. ఇప్పటికీ ఈ విషయంలో పెయిన్ ఉంది. ఎందుకు జరిగింది అది. అది అతని తప్పా? నా తప్పా? అనే పాయింట్ గురించి చర్చించాలని అనుకోవడం లేదు. ఇద్దరం వంద సార్లు ఎదురుపడ్డాం, వంద సార్లు మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మా ఇద్దరి మధ్య కీచులాట అనేది భార్యాభర్తల మధ్య ఉన్నట్టే ఉంటుంది అని మోహన్ బాబు అన్నారు. ఇప్పటికీ ఇద్దరం కూల్ గానే ఉన్నామని అన్నారు. మరి మోహన్ బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.