తెలుగు చలనచిత్ర రంగంలో మంచు వారి ముద్ర ఎప్పటికీ చెదరనిది. ఇక విలక్షణ నటుడిగా నటుడిగా, కలెక్షన్ కింగ్ గా మెహన్ బాబు ప్రస్థానాన్ని ఎవరు మాత్రం మరచిపోగలరు. ఇక మంచు లక్ష్మీ తాజాగా తన తండ్రి హోమ్ టూర్ వీడియో చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంద్రభవనాన్ని తలపించే ఆ ఇంటి సంగతులను పక్కన పెడితే.. ఈ హోమ్ టూర్ పుణ్యమా అంటూ.. మంచు కుటుంబానికి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం బయట పడింది.
హోమ్ టూర్ వీడియోలో తన ఇంటి ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు విశిష్టత గురించి మోహన్ బాబు తన కూతురికివివరించారు. ఈ క్రమంలోనే.. ముద్రగడ పద్మనాభం ఈసారి కూడా 300 కొబ్బరి కాయలు పంపినట్టు కూడా తన కూతురికి తెలియజేశారు మోహన్ బాబు. దీంతో మంచు లక్ష్మీ వెంటనే.. ముద్రగడకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేసింది. ఆ తరువాత తమ కుటుంబంపై ముద్రగడ పద్మనాభం ఎంత ప్రేమని చూపిస్తారో, ప్రతి ఏడాది ఎలాంటి ఆహార పదార్ధాలు తమ కోసం పంపిస్తారో మంచు లక్ష్మీ వివరంగా చెప్పుకొచ్చింది. ఏదేమైనా.. మంచు ఫ్యామిలీకి, ముద్రగడ కుటుంబానికి ఇంతటి అనుబంధం ఉందా అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి.. ఈవిషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.