సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం ఒకరినే తీసుకుంటారు. కానీ అనూహ్యంగా మరో క్యారెక్టర్ కథలో మిళితం అయితే.. మరొక ఆర్టిస్టును అప్పటికప్పుడు సెట్ చేయలేక.. ఆ సినిమాలో ఉన్న వ్యక్తినే సెలక్ట్ చేసి.. మేకప్ మార్చి మరో క్యారెక్టర్ ఇస్తారు. దానవీర శూరకర్ణలో చలపతిరావు నాలుగు ఐదు క్యారెక్టర్లు చేసిన సంగతి విదితమే. తాజాగా ఓ నటుడు..
ఓ సినిమా తీయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. అందుకే చాలా శ్రద్ధగా తెరకెక్కిస్తుంటారు దర్శక నిర్మాతలు. ఎక్కడ తప్పులు దొర్లకుండా సినిమాను తీస్తుంటారు. ఓ క్యారెక్టర్ కోసం ఒకరినే తీసుకుంటారు. కానీ అనూహ్యంగా మరో క్యారెక్టర్ కథలో మిళితం అయితే.. మరొక ఆర్టిస్టును అప్పటికప్పుడు సెట్ చేయలేక.. ఆ సినిమాలో ఉన్న వ్యక్తినే సెలక్ట్ చేసి.. మేకప్ మార్చి మరో క్యారెక్టర్ ఇస్తారు. దాన వీర శూర కర్ణ సినిమాలో ఇదే జరిగింది. చలపతి రావును ఐదు క్యారెక్టర్లు చేసినట్లు ఆయనే వెల్లడించారు. అందుబాటులో ఆర్టిస్టులు లేకపోవడంతో ఇంద్రుడు, శూతుడు, జరాసంధుడుతో పాటు మరో రెండు క్యారెక్టర్లను తానే పోషించారు. అలాగే ఇప్పుడు మరో నటుడు..ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్లు చేశాడు.
2018లో వచ్చిన తుంబాడ్ సినిమాను చూశారా. రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన మరాఠీ డార్క్ ఫాంటసీ పీరియడ్ హారర్ చిత్రం. ఈ సినిమా చూస్తున్నంత సేపు భయమేస్తుంటుంది. అయితే ఇందులో ఓ వ్యక్తి రెండు పాత్రలు పోషించాడని మీకు తెలుసా. అవునండీ. ఈ సినిమాలో వినాయక్ రావు (సోహుమ్ షా) కొడుకుగా నటించాడు పాండు రంగ్ . అతడి అసలు పేరు మొహ్మద్ సమద్. ఈ సమద్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించాడు. ఒకటి కొడుకుగా.. మరొకటి బామ్మ పాత్రలో మెరిశాడు. ఆ పాత్ర చాలా భయానకంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చి చాన్నాళ్లు అయిపోయినా.. బూతద్దం పెట్టి వెతికే వాళ్లు ఉంటారు కదా. చివరకు సినిమాలో అతడు పోషించిన రెండు క్యారెక్టర్లను పక్కపక్కన పెట్టేసి.. కనిపెట్టాశామోచ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సమద్.. బామ్మ పాత్రలో అద్భుతంగా నటించాడు. తొలుత ఈ సినిమా చూస్తే ఎవ్వరూ అతడిని గుర్తుపట్టలేరు.
Post the same actor in two roles that show their range https://t.co/m5oDeIq2xE pic.twitter.com/YYyM5CSEbh
— Sand-d Singh (@Sand_In_Deed) May 8, 2023