ప్రముఖ యువనటి, మోడల్ షహానా(20) కోజికోడ్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్ధితిలో మరణించింది. నగరంలోని పరంబిల్ బజార్‌లో తన ఇంటి విండో రెయిలింగ్‌కు ఆమె వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. చీరలు, ఆభరణాల యాడ్లతో కేరళ వాసులకు షహనా సుపరిచితం. నటిగా స్థిరపడేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తుండేది. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడం కేరళలో చర్చనీయాంశమైంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షహానాకు ఏడాదిన్నర క్రితమే పెళ్లయింది. కేరళలోని కోజికోడ్‌కు 14 కి.మీ దూరంలోని పరాంబిల్ బజార్‌లో భర్త సజ్జద్తో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. అనూహ్యంగా షహానా గురువారం రాత్రి 11.30కి అపార్ట్మెంట్లోని విండో రెయిలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న షహనా తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని.. బిడ్డను చూసి భోరున విలపించారు. ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు లేవనెత్తారు. ఇది హత్యే అయ్యుంటదని ఆరోపించారు. “భర్త ఎప్పుడూ తనను హింసించేవాడని షహనా చెబుతుండేదని తెలిపారు. తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదని కాదని తెలిపారు. తన బర్త్‌డే పార్టీకి రావాలని ఇటీవలే మమ్మల్ని ఆహ్వానించిందని షహనా తల్లి చెప్పుకొచ్చారు. హత్య ఆరోపణల నేపథ్యంలో షహనా భర్త సజ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మరణం వెనుక మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు.