దర్శకుడిగా రాజమౌళి పేరు ప్రపంచానికి తెలిసినప్పటికీ.. ఆయన ఫ్యామిలీలో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, శ్రీవల్లి, కార్తికేయ, విజయేంద్రప్రసాద్.. ఇలా వీరందరి పేర్లు రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి. వీరి ఫ్యామిలీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ పేరు తక్కువగా వింటుంటాం. కానీ.. శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది.
ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దర్శకుడిగా రాజమౌళి పేరు ప్రపంచానికి తెలిసినప్పటికీ.. ఆయన ఫ్యామిలీలో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, శ్రీవల్లి, కార్తికేయ, విజయేంద్రప్రసాద్.. ఇలా వీరందరి పేర్లు రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి. వీరి ఫ్యామిలీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ పేరు తక్కువగా వింటుంటాం. కానీ.. శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుంది. పాతికేళ్లుగా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా రాణిస్తున్న శ్రీలేఖ.. కెరీర్ లో ఇప్పటిదాకా దాదాపు 80 సినిమాలకు పైగా మ్యూజిక్ అందించింది.
శ్రీలేఖకి రాజమౌళి, కీరవాణి సోదరులు అవుతారట. చిన్నప్పటి నుండే ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీలేఖ.. టీనేజ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసింది. కెరీర్ లో చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలు, అగ్ర దర్శకులతో సైతం వర్క్ చేసింది. ఇక ఇండస్ట్రీలో శ్రీలేఖ కెరీర్ 25 ఏళ్ళు పూర్తవడంతో.. ఇటీవల హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ హైకోర్టు జడ్జి నందా స్పెషల్ గెస్ట్ గా పాల్గొనగా.. విజయేంద్ర ప్రసాద్, వైవిఎస్ చౌదరి, ఆలీ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలేఖ తన సినీ జర్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
శ్రీలేఖ మాట్లాడుతూ.. “చిన్నప్పుడు కీరవాణి గారు దగ్గర సంగీత పాఠాలను చాలా త్వరగా నేర్చుకునే దాన్ని. కెరీర్ లో చాలా సినిమాలకు వర్క్ చేశా. కానీ.. మా సోదరుడు రాజమౌళి సినిమాకి వర్క్ చేస్తానని.. ఆయన్ని నేనెప్పుడూ అడగలేదు. సోదరుడు అయినంత మాత్రాన నాకు అవకాశం ఇవ్వాలనే రూల్ లేదు కదా! రాజమౌళి సినిమాలకు ముందునుండి పెద్దన్న కీరవాణినే వర్క్ చేస్తున్నారు. సో.. వారి బంధాన్ని నేను విడగొట్టాలని అనుకోట్లేదు. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నా.. పెద్దగా ఆస్తులు వెనకేసుకోలేదు. ఇప్పుడు కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కానీ.. కావాల్సినంత అభిమానులను మాత్రం సంపాదించుకోగలిగాను. ఇదిలా ఉండగా.. తన పాతికేళ్ల కెరీర్ ని సెలబ్రేట్ చేసుకునేందుకు శ్రీలేఖ 25 దేశాలలో పర్యటించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం శ్రీలేఖ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఎంఎం శ్రీలేఖ గురించి.. రాజమౌళి – కీరవాణి కాంబినేషన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.