ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పింన నటి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. నగరి ఎమ్మెల్యేగా రోజా.. తనదైన శైలితో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె, కొన్నాళ్లుగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజలతో నిత్యం కలిసే రోజా.. జబర్దస్త్ షో లో జడ్జీగా వ్యవహరిస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షో ద్వారా రోజాకు వచ్చిన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె 100కు పైగా సినిమాల్లో నటించింది. తాజాగా మహేష్ బాబుతో నటించాలని ఉందని రోజా తన మనస్సులోని మాటను వెల్లడించింది. ఈ విషయాన్ని జబర్దస్త్ లోని ఓ స్కిట్ ద్వారా ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
జబర్దస్త్ షో లో భాగంగా హైపర్ ఆది టీమ్ నగరిలోని ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లారు. అక్కడ హాల్ లో వేంకటేశ్వర స్వామి ఫోటో ఉండటంతో, దానిని చూసిన ఆది.. స్వామివారిని ఏమి కోరుకుంటారమ్మ అని రోజాను అడిగితే.. కృష్ణగారి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉందంటూ రోజా తన మనస్సులోని మాటను బయటపెట్టింది. దీనికి స్పందించిన ఆది.. “కృష్ణా, రామా అని పాడుకోక ఎందుకండీ మనకు ఈ కృష్ణగారి కొడుకు..” అంటూ పంచ్ వేయడంతో సీరియస్ గా లుక్ ఇచ్చింది రోజా. ఆ తర్వాత డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లారు. టీలో కలపడానికి ఉప్పు ఎక్కడా అని వంటమనిషిని రోజా అడిగేసరికి.. ఆది టీమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఇదంతా స్కిట్ లో భాగమని తెలుస్తోంది. మీరు ఈ జబర్దస్త్ ప్రోమో పై ఓ లుక్కేయ్యండి. మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.