వెబ్ సిరీస్‌లలో మీర్జాపూర్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ వెబ్ సిరీస్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరం చూశాం. కేజీఎఫ్ తర్వాత ఛాప్టర్ 2 కోసం ఎంతగా ఎదురు చూశారో.. అలాగే మీర్జాపూర్ చూశాక సీజన్ 2 కోసం అంతే ఎదురు చూశారు. వీ వాంట్ మీర్జాపూర్ సీజన్ 2 అని సోషల్ మీడియాలో డిమాండ్లు కూడా చేశారు. అందరూ కోరుకున్నట్లుగానే సీజన్ 2 రిలీజ్ కావడం దానికి కూడా అశేష ఆదరణ లభించడం చూశాం. ఇప్పుడు ప్రేక్షకులు అందరూ మీర్జాపూర్ సీజన్ 3 కోసం ఎదురుచూపులు మొదలు పెట్టేశారు. మళ్లీ సీజన్ 3 ఎప్పుడంటూ డిమాండ్లు లేవనెత్తుతున్నారు.
ఇదీ చదవండి: RRR, KGF సినిమాలపై అభిషేక్ బచ్చన్ దురుసు వ్యాఖ్యలు!
మీర్జాపూర్ కథ గురించి ఒకసారి రీకాల్ చేసుకుంటే.. ఉత్తరప్రదేశ్ లో జరిగే మాఫియా కార్యక్రమాలు, అక్కడ జరిగే ఆధిపత్య పోరు గురించే మొత్తం మీర్జాపూర్ కథ నడుస్తుందని తెలిసిందే. మీర్జాపూర్ లో త్రిపాఠి కుటుంబం కార్పెట్ బిజినెస్ ముసుగులో చేస్తున్న అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాల సరఫరా చుట్టూ కథ ప్రారంభం అవుతుంది. బబ్లు, గుడ్డూ అనే ఇద్దరు అన్నదమ్ములు పంకజ్ త్రిపాఠి(కాలీన్ భయ్యా) దగ్గర పనిలో చేరి వారి బిజినెస్ ను రెండింతలు చేస్తారు. అయితే గుడ్డూ భార్య స్వీటీ విషయంలో వారి మధ్య గొడవలు జరుగుతాయి. దాంతో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా.. బబ్లూని, గర్భవతిగా ఉన్న స్వీటీని పార్టీలో కాల్చి చంపేస్తాడు. ఆ ఘటనతో మీర్జాపూర్ సీజన్ 1 కథ ముగుస్తుంది.
సీజన్ 2లో గుడ్డూ, స్వీటీ సోదరి గోలు ఇద్దరూ కలిసి పంకజ్ త్రిపాఠి, మున్నా మీద పగ తీర్చుకునేందుకు సిద్ధమవుతారు. ఈ గ్యాప్ లో మున్నా ఒక విధవరాలైన రాజకీయ నేత మాధురీ యాదవ్ ను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె సీఎం కావడంతో మున్నా మరింత బలపడతాడు. గుడ్డూ, గోలూ కాలీన్ భయ్యా మిగిలిన శత్రువులతో చేతులు కలిపి యుద్ధం సాగిస్తారు. మధ్యలో తన ఇల్లీగల్ ఎఫైర్ ను అడ్డుపెట్టుకుని తనను వాడుకున్న మామపై పంకజ్ త్రిపాఠి భార్య పగ తీర్చుకుంటుంది. మున్నాపై గుడ్డూ బుల్లెట్ల వర్షం కురిపించి అతడిని హతమార్చడంతో సీజన్ 2 కథ ముగుస్తుంది.
ఇదీ చదవండి: హీరోపై లైంగిక ఆరోపణలు.. అవకాశాల పేరుతో వాడుకున్నాడని మహిళ ఫిర్యాదు!
మీర్జాపూర్ కథ ముగవలేదని సీజన్ 2 చూస్తే అర్థమవుతుంది. సీజన్ 3 రానున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆ సీజన్ కు మంచి హైప్ వచ్చింది. ఈ నేపథ్యంలో మీర్జాపూర్ టీమ్ నుంచి ఓ క్రేజీ అప్డేట్ లీక్ అయ్యింది. అదేంటంటే చాలా తొందర్లోనే మీర్జాపూర్ సీజన్ 3 సెట్స్ మీదకు రానుందని తెలుస్తోంది. అంతేకాదు.. సీజన్ 3 2022లోనే అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు చెబుతున్నారు. ఇంక కథ విషయానికి వస్తే.. సీజన్ 3లో గుడ్డూ- గోలు, కాలీన్ భయ్యా మధ్య యుద్ధం జరగనుంది. ఇంకో విషయం ఏంటంటే.. రెండు సీజన్లతో పోల్చుకుంటే మూడో పార్ట్ ఇంకా రక్తసిక్తం కానున్నట్లు చెబుతున్నారు. మరిన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా జోడిస్తున్నట్లు తెలుస్తోంది. మీర్జాపూర్ సీజన్ 3 కోసం మీరూ ఎదురుచూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.