మంత్రి ఆర్కే రోజా.. ఒక హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర జడ్జిగా అందరికీ సుపరిచితమే. మంత్రి అయిన తర్వాత ఆవిడ చాలా బిజీ అయిపోయారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను కుటుంబసమేతంగా కలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఒక్కరే కాదు.. కుటుంబ సభ్యులు అందరూ ప్రజలకు పరిచయం ఉన్నవారే. ప్రస్తుతం మంత్రి రోజా భర్త సెల్వమణి చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఒక డైరెక్టర్ అయ్యి ఉండి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: విశ్వక్ సేన్- యాంకర్ దేవీ నాగవల్లి గొడవపై నిర్మాత చిట్టిబాబు క్లారిటీ!
విషయం ఏంటంటే.. తమిళ సినిమాలకు సంబంధించి షూటింగ్ అధిక శాతం హైదరాబాద్, విశాఖలోనే జరుగుతోందని సెల్వమణి అభిప్రాయపడ్డారు. ఇకపై తమిళ సినిమాల షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లో చేయకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ బట్టి చూస్తే ఆయన తమిళనాడులో సినీ రాజకీయం ప్రారంభించారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షూటింగ్స్ విషయంపై మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాలను నమ్ముకున్న కార్మికులకు ఇక్కడ పని ఉండటం లేదు. తమిళ్ లో ఉన్న అగ్ర హీరోలంతా వారి సినిమా షూటింగ్ ఎక్కవ శాతం హైదరాబాద్, విశాఖలోనే చేసుకుంటున్నారు. వారిని చెన్నైలో షూటింగ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. చెన్నైలో షూటింగ్ చేసుకునేందుకు తమిళ సూపర్ స్టార్స్ రజనీ కాంత్, విజయ్ అంగీకరించారు. మిగిలిన హీరోలు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది’ అంటూ సెల్వమణి కామెంట్ చేశారు.
వాస్తవానికి సెల్వమణి ‘ఫెప్సీ’ అనే సినీ కార్మిక సంస్థ నడుపుతున్న విషయం తెలిసిందే. షూటింగ్లు అన్నీ హైదరాబాద్– విశాఖలో చేస్తే అక్కడ వారి సంస్థ, అక్కడున్న సినీ కార్మికులకు ఇబ్బంది మారుతోందనే ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. అయితే ఈ విషంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమా కథ, సీన్ బట్టి లొకేషన్ ఫిక్స్ చేసుకుంటారు. ఇక్కడే తీయాలి, ఇదే లొకేషన్స్ తీయాలి అంటే కుదరదు కదా? ఒక దర్శకుడుగా ఉన్న సెల్వమణికి ఈ విషయం తెలియదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మంత్రి రోజా భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.