జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను దెబ్బతీయడానికే ప్రభుత్వం టిక్కెట్ల ధరలు తగ్గించిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ అంటే మాకు సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ భయం లేదు. పవన్ కళ్యాణ్ ఎవరు? ఏడాదికి ఒక్క సినిమా తీస్తాడు. అతన్ని దెబ్బతీయడానికి మేమెందుకు ప్రయత్నిస్తాం? ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మరో నటుడు మాత్రమే. అల్లు అర్జున్, చిరంజీవిల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబడుతున్నాడా..?’’ అని పేర్ని నాని ఘాటుగా స్పందించారు.
‘చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు సినిమాలు అతని సినిమాల కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. అప్పుడెప్పుడో అత్తారింటికి దారేది సినిమా బాగా ఆడింది. దాన్ని చూపిస్తూ తన సినిమాలను అమ్ముతున్నాడు. సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ మేం పవన్ కళ్యాణ్ కి భయపడం. పేదలు, సినీ ప్రేమికుల బలహీనతలను సొమ్ము చేసుకునే ఆలోచనను ఆపేందుకు మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు.అదేవిధంగా ఇప్పుడున్న ప్రతి హీరో.. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కంటే చాలా బెటర్ గా ఉన్నారు. ఆయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన వారు కూడా ఆయన కంటే బాగా రాణిస్తున్నారు. పేదల దోపిడీని అరికట్టేందుకు సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాము. అదే సమయంలో పరిశ్రమపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అంటూ పవన్ పై నాని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం నాని మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మరి మంత్రి నాని మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.