డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కనిపించబోతున్నట్లు ప్రకటించారు. బాక్సింగ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైసన్ తొలిసారి ఒక ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే లైగర్‌పై భారీ అంచనాలు ఉండగా మైక్ టైసన్ కూడా యాడ్ అవ్వడంతో ఈ సినిమాపై అంచానా తారా స్థాయికి చేరాయి. పాన్‌ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను కరన్‌జోహర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా ప్రోడ్యూస్ చేస్తున్నారు.
We promised you Madness!
We are just getting started 🙂For the first time on Indian Screens. Joining our mass spectacle – #LIGER
The Baddest Man on the Planet
The God of Boxing
The Legend, the Beast, the Greatest of all Time!IRON MIKE TYSON#NamasteTYSON pic.twitter.com/B8urGcv8HR
— Vijay Deverakonda (@TheDeverakonda) September 27, 2021