ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మరో తెలుగు సినిమా 'మైఖేల్'. సందీప్ కిషన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాల నుండి రీజియన్ సినిమాల వరకు అన్నీ ఒకే బాటపడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద సినిమాల పెర్ఫార్మన్స్ బట్టి, కొన్నిసార్లు ముందు, వెనుక అన్నట్లుగా ఓటిటిలలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా పెద్ద హిట్ అంటే.. మినిమమ్ నెల రోజుల తర్వాతే ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం.. విడుదలైన రెండు మూడు వారాలకే ఓటిటిలో ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే.. ఓటిటి సినిమాల విషయంలో ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు.
ఈ క్రమంలో ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మరో తెలుగు సినిమా.. ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. హీరో సందీప్ కిషన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మైఖేల్’. తమిళ డైరెక్టర్ రంజిత్ జైకోడి తెరకెక్కించిన ఈ సినిమా.. ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైంది. విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా.. రిలీజ్ ముందు అంచనాలు భారీగా సెట్ చేసినప్పటికీ, ఫలితం విషయంలో నిరాశపరిచింది. మొదటి రోజు నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.
ఇక మైఖేల్ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి తాజాగా కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను తెలుగు ఓటిటి ఆహా సొంతం చేసుకుందని సమాచారం. ముందుగా ఈ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే ఓటిటి రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ.. నెగటివ్ టాక్ రావడంతో కాస్త ముందే స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నారట ఆహా వారు. తాజా సినీవర్గాల ప్రకారం.. మైఖేల్ మూవీ ఫిబ్రవరి చివరి వారంలో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. ఇక కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం అందించాడు. మరి మైఖేల్ ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి మైఖేల్ ఓటిటి రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి.
#Michael OTT RELEASE VERY SOON ON@ahavideoIN pic.twitter.com/lN2GWwo0xM
— OTTGURU (@OTTGURU1) February 6, 2023