లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ వివాహం మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అతిరథమహారధుల సమక్షంలో నయనతార- విగ్నేష్ లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నయన్-విఘ్నేష్ పెళ్లికి.. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ సేతుపతి, సూర్యా, హీరో కార్తీ, అట్లీ, శరత్ కుమార్.. ఇంక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వంటి సినిమా సూపర్ స్టార్లు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే మరోవైపు నయన్- విక్కీ వివాహంపై మీమ్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
అదుర్స్ సినిమాలో ప్రేమకు వయసుతో సంబంధం లేదని భట్టు.. చంద్రకళను ప్రేమిస్తాడు. కాకపోతే అతని దగ్గర ఉండే శిష్యుడు భట్టు- చంద్రకళ వివాహం చేసుకునే విషయం తెలిసిందే.
ఆ సినిమాలో భట్టు భగ్న ప్రేమికుడిగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ భట్టు పేరుతో మీమర్స్ సోషల్ మీడియాలో నయన్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
‘నువ్వు ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి చందు.. పిల్లా పాపలతో చల్లగా ఉండు చందు’ కొటేషన్స్ పెట్టి మీమర్స్ తమదైన శైలిలో నయనతారకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
విగ్నేష్ శివన్- నయనతారకు నుదిటిన ముద్దుపెడుతున్న ఫొటోని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి తమ వివాహం జరిగిన విషయాన్ని వెల్లడించారు. మీమర్స్ అంతా అదే ఫొటోపై భట్టుతో మీమ్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న ఈ మీమ్స్ ని చూసి వాటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by @APARICHITHUDU_RA_VEEDU 2.5k 🎯 (@aparichithudu_ra_veedu)