ఇప్పుడు హీరోయిన్లు దాదాపుగా ఒకే లుక్‌లో కనిపిస్తున్నారు. సన్నగా, ఫిట్‌గా ఉండే లుక్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు.
సినీ తారలు అన్నాక అందంతో పాటు ఫిట్నెస్ను కూడా కాపాడుకోవాల్సిందే. మంచి నటనతో పాటు స్క్రీన్ మీద అందంగా, ఫిట్‌గా కనిపించడం నటులకు తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు యాక్టర్స్ కాస్త బొద్దుగా కనిపించినా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఫిట్నెస్ కీలకంగా మారింది. అందుకే యాక్టర్స్ జిమ్‌లో గంటల కొద్దీ గడుపుతుంటారు. హీరోలైతే పాత్రలకు తగ్గట్లుగా కండల్ని పెంచేస్తున్నారు. మూవీ షూట్ అయిపోయాక మళ్లీ మామూలు లుక్‌లోకి మారిపోతున్నారు. అదే హీరోయిన్లు మాత్రం దాదాపుగా ఒకే లుక్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. హీరోయిన్లు చాలా మటుకు సైజ్ జీరో లుక్‌లోనే కనిపిస్తున్నారు. ఒకరు అరా తప్పితే దాదాపు హీరోయిన్లు అందరూ సన్నగా ఉండే లుక్కే మొగ్గు చెబుతున్నారు.
టాలీవుడ్‌కు వచ్చేసరికి ముద్దుగా, బొద్దుగా ఉండే కీర్తి సురేష్, రాశి ఖన్నాలు కూడా ఇప్పుడు థిన్ లుక్‌లోకి వచ్చేశారు. ఇప్పుడీ జాబితాలోకి చేరింది మరో హీరోయిన్. ఆమెనే మెహ్రీన్ పిర్జాదా. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ మూవీస్‌తో ఇక్కడ స్టార్డమ్ సంపాదించింది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ పంజాబీ గర్ల్.. చక్కటి హావభావాలు, డ్యాన్సులతో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే నిన్నమొన్నటి వరకు బొద్దుగా కనిపిస్తూ పాత హీరోయిన్లను గుర్తుచేసిన మెహ్రీన్.. హఠాత్తుగా సైజ్ జీరోలోకి మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మెహ్రీన్ లుక్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆమె ఎందుకిలా మారింది? సినిమా కోసం ఈ గెటప్‌లోకి మారిందా అని ప్రేక్షకులు షాకవుతున్నారు. దీనిపై మెహ్రీన్ క్లారిటీ ఇస్తే కానీ స్పష్టత రాదు.
#MehreenPirzada Latest Clicks @Mehreenpirzada pic.twitter.com/gzS0YKo3Yc
— Cinema Mania (@ursniresh) May 3, 2023