సినీ అభిమానులకు వారి అభిమాన నటుల గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు – కొత్త సినిమా అప్డేట్స్ తెలుసుకోవాలనే ఆత్రం ఉంటుంది. ఎప్పుడెప్పుడు మా హీరో తెరమీద లేదా టీవీలో కనిపిస్తాడనే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. తెలుగు ప్రేక్షకులకు ఈ మధ్యకాలంలో అభిమాన తారలను టీవీలో చూసే అవకాశాలు లభిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ లు టీవీ స్క్రీన్ పై కనిపించి అభిమానులను కనువిందు చేశారు.
ఇటీవల జెమినీ ఛానల్ ప్రసారం చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు?’ షోని ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్ లో మహేష్ బాబు పాల్గొన్నాడు. సరదాగా ఆటను ఆడుతూనే మధ్యమధ్యలో మహేష్ పర్సనల్ విషయాలు షేర్ చేసాడు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా మహేష్ పై ప్రశ్నలు సంధించాడు.
అయితే ఓ సందర్భంలో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు మహేష్ చాలా కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పాడు. కానీ ఎన్టీఆర్ అంతటితో ఆగకుండా అదే టాపిక్ సంబంధించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగేసరికి విసుగెత్తిపోయిన మహేష్.. “నేను చెప్పను. ఊరికే అవసరం లేని క్వశ్చన్స్ అడిగితే..” అంటూ కాస్త ఫైర్ అయ్యాడు. దీనితో ఎన్టీఆర్ చేసేదేం లేక మహేష్ చెప్పిన సమాధానం సరైనదే.. అని సెలవిచ్చాడు. ప్రస్తుతం వీరి ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.