ఈ మధ్యకాలంలో తెరకెక్కుతున్న సినిమాల్లో అప్పుడప్పుడు దర్శకులు కూడా ప్రత్యక్షమవుతున్నారు. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రెండు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు ఆఫర్ దక్కించుకున్నాడు. కానీ ఈసారి దర్శకుడిగా కాదండి.. నటుడిగా. అదేంటి పూరీ జగన్నాథ్ యాక్టింగ్ ఏంటని షాక్ అవ్వకండి. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ ట్వీట్ ద్వారా తెలిపారు.
మెగాస్టార్ చిరు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయారు. ఆచార్య విడుదలకు రెడీ అవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం పూరీని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. కొద్దీరోజులుగా చిరు సినిమాలో పూరీ అంటూ వచ్చిన రూమర్స్ కి మెగాస్టార్ ట్వీట్ తో చెక్ పడిందని చెప్పవచ్చు. కానీ మెగాస్టార్ సినిమాలో పూరీ నటుడిగా చేయడం ఏంటని షాక్ అవుతున్నారు.ఎందుకంటే.. చిరుతో సినిమా తీయాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు పూరీ. ఈ క్రమంలో దర్శకుడిగా కాకుండా.. ఆయన సినిమాలోనే యాక్టర్ అయ్యేసరికి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కానీ పూరీ ఇండస్ట్రీలోకి వచ్చింది కూడా నటుడు అవ్వాలనే అని చిరు ట్వీట్ లో చెప్పారు. మెగాస్టార్ ట్వీట్ లో.. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే ‘గాడ్ ఫాదర్’లో పూరీని స్పెషల్ రోల్ లో నటుడిగా పరిచయం చేస్తున్నాం” అంటూ చెప్పారు.
ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక గాడ్ ఫాదర్ మూవీ మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’ మూవీకి రీమేక్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. మరి పూరీకి ఏ రోల్ ప్లాన్ చేశారో చూడాలని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. మరి చిరుని డైరెక్ట్ చేయాలనుకున్న పూరీ చిరు పక్కనే యాక్ట్ చేయబోతున్నాడు. ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022