Megastar: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒకరినొకరు వాళ్ళ స్టైల్ ని ఇమిటేట్ చేసుకుంటే.. ఆ మూమెంట్ లో ఫ్యాన్స్ సంబరం మాములుగా ఉండదు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్, సూపర్ స్టార్ తలైవా ఫ్యాన్స్ అలాంటి ఆనందంలోనే ఉన్నారు. సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవిల గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎవరి స్టైల్ లో వారి మేటి అనిపించుకొని ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఒకరు అదిరిపోయే డాన్స్, ఫైట్, యాక్టింగ్ చేస్తే.. మరొకరు కేవలం స్టైల్, డైలాగ్స్, నడకతోనే వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అయితే.. వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఊహించుకున్నారా.. కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కాబట్టి.. అదెలాగో జరిగేలా లేదు. కానీ.. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేస్తే.. ఆ కిక్కే వేరప్పా! అనిపిస్తుంది.
తాజాగా మెగాస్టార్ చిరు.. సూపర్ స్టార్ స్టైల్ ని ఇమిటేట్ చేసి.. స్టేజిపై తలైవా వాకింగ్ స్టైల్ అదరగొట్టి ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించారు. ఇంతకీ ఇదెప్పుడు జరిగిందని అనుకుంటున్నారా.. తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేలో. ఇటీవలే ముగిసిన తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేకి మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ లో రజినీ పాపులర్ బీజీఎం ప్లే అవుతుండగా.. చిరు స్టేజి మీదకు తలైవాలా నడుచుకుంటూ వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.
అదేవిధంగా అక్కడున్న ఓ సింగర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇతడు నా అభిమాని కాదు..రజినీకాంత్‌కు అభిమాని’ అని.. తన తరపున కళ్ళజోడును గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే.. ఓ స్టార్ హీరో మరో స్టార్ ని ఇమిటేట్ చేయడం చాలా అరుదుగాజరుగుతుంది. రజినీ మ్యూజిక్ కి చిరు వాకింగ్ చేస్తే ఎట్లుంటది.. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.